జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..26 గేట్లు ఓపెన్

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..26 గేట్లు ఓపెన్

మహబూబ్ నగర్: ఎగువ నుంచి వస్తున్న జూరాల ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.   జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో లక్షా 90వేల క్యూసెక్కులుండగా..గేట్లను ఓపెన్ చేయడంద్వారా, విద్యుత్ తయారీ యూనిట్ల ద్వారా  2లక్షల8వేల 260 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  


జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీట్లరు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 317.970 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలుండగా.. ప్రస్తుత నీటి నిల్వ 8.551 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అధికారులు. 

Also Read:-సుప్రీంకోర్టు తీర్పు ఓ వార్నింగ్​లా ఉండాలి