కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు.. ఏపీలో రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు లెక్కింపు  

ఇటు తెలంగాణలోనూ.. అటు ఏపీలోనూ రెండేసి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలంగాణలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి, అలాగే నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగగా..  ఏపీలో ఎన్నికలు జరిగిన కృష్ణా-గుంటూరు టీచర్స్ ఎమ్మెల్సీతోపాటు.. ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ  స్థానానికి బుధవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ కు వచ్చిన అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో శీలు వేసిన  స్ట్రాంగ్ రూమ్  లను ఓపెన్ చేసి పోలింగ్ కేంద్రాల నుంచి తీసుకొచ్చి భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్ లను కౌంటింగ్ హాల్స్ లోకి తరలించారు.

తెలంగాణ ఓట్ల లెక్కింపు పూర్తికి రెండు రోజులు పట్టే అవకాశం

తెలంగాణలోని గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి రెండ్రోజుల టైమ్పట్టే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 50 శాతం ప్లస్వన్ఓటు వచ్చిన వారినే గెలిచినట్లు ప్రకటించాల్సి ఉండటంతో ఓట్లు వచ్చే వరకు రౌండ్ల వారీగా కౌంటింగ్జరుగుతూ పోతుంది. తక్కువ ఓట్లు వచ్చిన క్యాండిడేట్లను ఎలిమినేట్చేస్తూ వాళ్ల ప్రాధాన్యత ఓట్లను మిగిలిన క్యాండిడేట్లకు కలుపుతూ 50 శాతం ఓట్లు వచ్చే వరకు కౌంటింగ్సాగుతుంటుంది. ఈసారి వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి 71 మంది క్యాండిడేట్లు పోటీ చేశారు. ఇక్కడ 5,05,565 ఓట్లకు 3,86,320 ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్స్థానానికి 93 మంది పోటీపడ్డారు. ఇక్కడ 5,31,268 ఓట్లకు 3,57,354 ఓట్లు పడ్డాయి. సాధారణంగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్‌‌కు చాలా టైమ్‌‌ పడుతుంది. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ఎన్నిక రిజల్ట్‌‌ ప్రకటించేందుకు36 గంటలు పట్టింది. ఇప్పుడు రెండు స్థానాల్లోనూ పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండటం, ఎక్కువ సంఖ్యలో ఓట్లు పడటం, పెద్ద బ్యాలెట్పేపర్ కావడంతో రెండ్రోజులైనా పడుతుందని సీఈవో శశాంక్ గోయల్ చెప్పారు. న్యూస్ పేపరంత సైజులో మడిచి ఉన్న బ్యాలెట్పేపర్‌‌ను విప్పడం, దాంట్లో చెల్లని ఓట్లను గుర్తించడం, ఆ తరువాత ప్రాధాన్యత ఓట్లను గుర్తించడం, ఎలిమినేషన్ చేసేందుకు చాలా టైం పడ్తుందని అన్నారు. రెండు స్థానాల ఓట్ల లెక్కింపునకు రెండు కేంద్రాల్లో 8 హాళ్లు, 56 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. రెండింటికీ కలిపి 1,760 మంది కౌంటింగ్స్టాఫ్‌ను నియమించారు. వీరికి ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయింది. షిప్టుల వారీగా డ్యూటీలు వేశారు. కౌంటింగ్ ప్రక్రియ రేయింబవళ్లు కొనసాగనుంది. 19వ తేదీ వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్‌‌ పూర్తయ్యే వరకు సిబ్బందికి  కనీస వసతులు అక్కడే ఏర్పాటు చేశారు. 

ఏపీలో రెండు చోట్ల ఓట్ల లెక్కింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపును గుంటూరు ఏసీ కాలేజీలో14 టేబుళ్లు ఏర్పాటు చేసి ప్రారంభించగా.. కాకినాడ జేఎన్టీయూలో 10 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కింపు జరుపుతున్నారు. కృష్ణా-గుంటూరు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది, ఉభయ గోదావరి ఎమ్మెల్సీ స్థానానికి 11 మంది పోటీ చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో 30 వేల 972 ది ఓటర్లు ఉండగా.. వారిలో 28 వేల 622 మంది (92.41శాతం) ఓటేశారు. మధ్యాహ్నానికల్లా ఏపీలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.