దేవాదుల 3వ పేజ్ టన్నెల్ లీకేజీ వద్ద కొనసాగుతున్న పనులు

దేవాదుల 3వ పేజ్ టన్నెల్ లీకేజీ వద్ద కొనసాగుతున్న పనులు

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో దేవాదుల 3వ పేజ్ టన్నెల్ లీకేజీ వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. టన్నెల్, పైప్ లైన్ జాయింట్ వద్ద మేజర్ లీకేజీ కావడంతో మరమ్మతులు చేయడానికి డీ వాటరింగ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ ని వివరణ కోరగా, ఇది ట్రయల్​రన్​ మాత్రమేనని ట్రయల్​రన్ ద్వారా నీటిని కొద్దిగా విడుదల చేస్తున్నామన్నారు. 

25శాతం సామర్థ్యం నీటి విడుదలతో లోపాలు తెలిశాయని ఇలాంటి లోపాలు పిక్స్​చేశాక, పూర్తిగా నీటిని వదులుతామని తెలిపారు. సోమవారం సాయంత్రం పెద్ద జెనరేటర్ తీసుకొచ్చి 15హెచ్ పీ మోటర్లు బిగించి నీటిని వేగంగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నామని, సోమవారం అర్థరాత్రి వరకు డీ వాటరింగ్ పూర్తవుతుందని తెలిపారు.