
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ శుక్రవారం 36వ రోజు ఆత్మకూరు మండలం పారుపల్లి, మోత్కూరు గ్రామాల్లో కొనసాగింది. మోత్కూరులో స్థానికులతో మాటా ముచ్చట నిర్వహించారు. వైయస్ఆర్ పథకాలు నేటికీ సజీవంగా ఉన్నాయంటే అది ఆయన పాలన దక్షతకు నిదర్శనమన్నారు వైఎస్ షర్మిల. కేసీఆర్ పథకాలు ఏ కుటుంబానికి సరిగ్గా అందలేదన్నారు. రైతుబంధు పథకంలో మోసాన్ని ప్రజలు గమనించార్నారు షర్మిల. కౌలు రైతును రైతుగా గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని విమర్శించారు. దళితులకు మూడెకరాలు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డ బుల్ బెడ్ రూం ఇండ్లు, మైనార్టీల కు 12శాతం రిజ ర్వేష న్లు ఇలా అన్ని రకాల హామీలు ఇచ్చి మోసం చేశాడన్నారు.
ఇవి కూడా చదవండి
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు