ఉల్లిపాయల ధరలు .. బంగాళదుంప ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎంత వరకు పెరిగే అవకాశం ఉంది? కేంద్ర వర్గాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం.
దేశంలో ఉల్లి , బంగాళదుంప ధర పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉల్లి, బంగాళ దంప పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కృత్రిమ కొరత వల్ల రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నాయి. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 2023–24 వ సంవత్సరంలో ఉద్యాన పంటల ఉత్పత్తి గురించి నివేదిక విడుదల చేసింది. ఉల్లి ఉత్పత్తిలో 15 శాతం.. బంగాళదుంప ఉత్పత్తిలో 2 శాతం సాగు తగ్గిందని నివేదికలో తెలిపింది.
2023–24 వ సంవత్సరంలో 25.47 మెట్రిక్ టన్నుల ఉల్లి (MT) ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తెలిపింది. గతేడాది 30.21 మెట్రిక్ టన్నులు MT ఆనియన్ పండగా.. ఈ ఏడాది పంట సాగు తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్రలో 3.43 మెట్రిక్ టన్నుల (MT), ఆంధ్రప్రదేశ్ లో 0.35 మెట్రిక్ టన్నుల (MT), రాజస్థాన్ లో 0.31 మెట్రిక్ టన్నుల (MT), కర్నాటకలో 0.99 మెట్రిక్ టన్నుల (MT) ఉత్పత్తి తక్కువుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
2023–24 వ సంవత్సరంలో బంగాళదుంప ఉత్పత్తి దాదాపు 58.99 మెట్రిక్ టన్నుల (MT) ఉంటుందని అంచనా వేశారు. గతేడాది 60.14 మెట్రిక్ టన్నుల (MT) ఉత్పత్తి చేశారు. ఈ ఏడాది ఉద్యానవన ఉత్పత్తి 355.25 మెట్రిక్ టన్నుల( MT) ఉంటుందని అంచనా వేశారు. హార్టికల్చర్ ను 0.33 హెక్టార్లలో సాగు చేయగా గతేడాది కంటే ఈ ఏడాద సాగు విస్తీర్ణం 1.15 శాతం పెరిగింది. పండ్లు 112.08 మెట్రిక్ టన్నుల (MT) ఉత్పత్తి అవుతాయని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రకటించింది. అరటి, నారింజ , మామిడి పండ్ల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపింది. అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గుమ్మడి, పచ్చిమిర్చి, టమాటా తదితర కూరగాయల ఉత్పత్తి గతేడాది కంటే పెరుగుతాయని ప్రకటించింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తుది అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 2021–22 లో 31.69 MT.... 2022–23లో30.21 MT ఉత్పత్తి అయింది.