మహబూబ్నగర్లో భారీ ఆన్ లైన్ యాప్ మోసం బయటపడింది. క్యాటర్ పిల్లర్ అనే యాప్లో రూపాయి పెట్టుబడి పెడితే.. వంద రూపాయల ఇస్తామని నిర్వాహకులు జనం నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఒకరిని యాప్కు పరిచయం చేస్తే వారి ఇన్వెస్ట్మెంట్లో 8 శాతం వాటా ఇస్తామని చెప్పి..యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారికి ఐడీ నంబర్, పాస్ వర్డ్ ఇచ్చారు. ఈ యాప్లో 600 నుంచి 10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చని తెలిపారు.
ఈ ప్రకటనతో చాలా మంది తమ దగ్గర ఉన్న బంగారం, వస్తువులు, వెహికల్స్ అమ్మి యాప్లో పెట్టుబడి పెట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా క్యాటర్ పిల్లర్ యాప్ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. అయితే.. ఈ నెల 8వ తేదీన యాప్ క్లోజ్ అయ్యింది. అప్పటి నుంచి యాప్ ఓపెన్ కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.