ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్స్

ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్స్

ఇండస్ట్రియల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)- స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ అప్లికేషన్స్​ కోరుతోంది.

పోస్టులు: మొత్తం 86 పోస్టుల్లో  మేనేజర్- గ్రేడ్ బి: 46,  అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం)- గ్రేడ్ సి: 39, డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం)- గ్రేడ్ డి: 1 పోస్టు అందుబాటులో ఉన్నాయి. 
అర్హత: ఖాళీలను అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ, సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. మేనేజర్ పోస్టులకు 25- నుంచి 35 ఏళ్లు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 28 నుంచి -40 ఏళ్లు. డిప్యూటీ జనరల్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులకు 35- నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్ లో డిసెంబర్​ 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.idbibank.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.