
ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 825 పోస్టుల్లో టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు : వయసు టీఏ/ డీఈవో పోస్టులకు 21 నుంచి -40 ఏళ్లు; హెల్పర్‌కు 18 నుంచి -35 ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మార్కులు, పని అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు : ఆఫ్‌లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 2వ తేదీ వరకు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సప్లైస్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడ అడ్రస్‌కు పంపాలి.