- రోజుకో 4 కొత్త యాప్స్.. నిషేధమున్నా అమలు ఉత్తిమాటే
- యువకులతోపాటు ఉద్యోగులు,పోలీసుల్లోనూ వ్యసనం
- ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు.. అధిక వడ్డీకి యాప్‌లో లోన్లు
- బెట్టింగ్, గేమ్స్‌లో ఉన్నదంతా పోగొట్టుకొని పీకల్లోతు కష్టాల్లోకి..
- వేధింపులు భరించలేక పెరుగుతున్న ఆత్మహత్యలు
- పిల్లలు చేసే అప్పులకుతల్లిదండ్రులూ సూసైడ్
వరంగల్, వెలుగు: ఆన్‌లైన్ బెట్టింగ్‌యాప్‌లు కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి. నిషేధమున్నా ఫోన్లో రోజుకో 4 కొత్త బెట్టింగ్యాప్స్పుట్టుకురావడంతో..యువకులతోపాటు ఉద్యోగులు, పోలీసులు వాటి బారినపడుతున్నారు. అదేపనిగా బెట్టింగ్చేస్తూ..ఆన్లైన్గేమ్స్ఆడుతూ.. ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆస్తులు తాకట్టుపెట్టి, లోన్‌యాప్‌లలో అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. అప్పులు, లోన్లు ఇచ్చినోళ్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
కొడుకులు చేసిన అప్పులు తల్లిదండ్రుల ప్రాణాలను బలితీసుకుంటున్న సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఇంట్లో ఒక్కరి వ్యసనం.. మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతున్నది. మొబైల్ఫోన్ఓపెన్ చేస్తే చాలు..‘‘వన్ ఎక్స్‌బెట్, మెగాపరి, మోస్ట్‌బెట్, పరిపేస, పరిమ్యాచ్, 10 సీఆర్ఐసీ, మెల్‌బెట్, మేట్‌బెట్, 1ఎక్స్ బెట్, బీసీ డాట్ గేమ్, 22 బెట్, రాజా బెట్స్, బెట్ 365, స్టేక్ డాట్ కమ్, డఫ్పా బెట్” లాంటి వందలాది అఫీషియల్, అన్అఫీషియల్ఆన్లైన్బెట్టింగ్యాప్స్ కనిపిస్తున్నాయి. యూట్యూబ్, సోషల్‌మీడియా, వెబ్సైట్లలో వంద రూపాయలు పెడితే రూ. వెయ్యి ఇస్తామంటూ బెట్టింగ్ యాప్స్యాడ్స్దర్శనమిస్తున్నాయి.
చేపకు గాలం వేసినట్టు కొత్త కస్టమర్లకు మొదట్లో రూ. వందకు రూ. రెండొందలు.. రూ. వెయ్యికి రెండు వేలు, మూడు వేలు ఇస్తూ మెల్లిగా ఊబిలోకి లాగుతున్నారు. ఈజీ మనీ కోసం అత్యాశతో కొందరు, వ్యసనాల బారిన పడి ఇంకొందరు.. పగలు, రాత్రి తేడా లేకుండా 24 నాలుగు గంటలూ ఆన్‌లైన్ బెట్టింగ్గేమ్స్లో మునిగితేలుతున్నారు.గతంలో ఈ వ్యసనం కొంతమంది యువత వరకే పరిమితమవగా..ఇప్పుడది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, సాఫ్ట్వేర్ఇంజినీర్లు, బ్యాంకర్లు..అనే తేడా లేకుండా ప్రతి రంగానికి చేరింది. అయితే..ఈ బెట్టింగ్ఆడే ప్రతి వంద మందిలో దాదాపు 95 శాతం మంది చేతులు కాల్చుకుని, ఆర్థికంగా చితికిపోతున్నారు. డబ్బుల కోసం కొందరు అడ్డదారి తొక్కుతుండగా..అవమానంగా భావించేవారు తమ ప్రాణాలతోపాటు కుటుంబ సభ్యుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.
అప్పులు తీర్చే దారి లేక కుటుంబమే బలి
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డపల్లిలో ఆన్‌లైన్ బెట్టింగ్ఊబిలో చిక్కుకుని రంగణవేణి హరీశ్(25) రూ.18 లక్షలు అప్పు చేశాడు. అవి తీర్చే దారి లేక తల్లిదండ్రులకు చెప్పాడు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం కావడంతో వేరే దారి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. హరీశ్‌తోపాటు అతడి తండ్రి సురేశ్, తల్లి హేమలత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
బెట్టింగ్ యాప్స్కుబలైన కలెక్టర్ గన్‌మెన్ కుటుంబం
సిద్దిపేట జిల్లాలో నిరుడు డిసెంబర్ 15న ఏకంగా కలెక్టర్‌వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్.. భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి తాను సూసైడ్ చేసుకున్నాడు. చిన్నకోడూరు మండలం రామునిపట్లకుచెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేశ్ ఐదేండ్లుగా సిద్దిపేట కలెక్టర్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. నరేశ్‌కు భార్య చైతన్య , కొడుకు రేవంత్ (6), కూతరు రిషిత (5) ఉన్నారు. నరేశ్ రెండేండ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఆట మైకంలో మొదట్లో వందలు, వేలల్లో ఉన్న అప్పు దాదాపు రూ.80 లక్షలకు చేరింది. వ్యవసాయ భూమిని అమ్మినా సగం అప్పు కూడా తీరలేదు. దీంతో రివాల్వర్‌తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడు. ఆపై తనను తాను కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు.
భార్య, బిడ్డకు విషమిచ్చి.. భర్త సూసైడ్
హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ రాధానగర్ ఫేజ్–2, యమునా అపార్ట్మెంట్లో ఉండే ఆనంద్ఈ ఏడాది ఏప్రిల్8న భార్య, బిడ్డను చంపి తాను సూసైడ్చేసుకున్నాడు. పాల వ్యాపారం చేసే ఆనంద్ ఆన్లైన్లో గేమ్స్, బెట్టింగ్వల్ల రూ.15 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఆర్థికంగా నష్టపోయి బంగారం, కారు సైతం అమ్మాడు. అప్పులిచ్చినోళ్ల వేధింపులు పెరగడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. చివరకు ఆనంద్ తన భార్య ఇందిరతోపాటు నాలుగేండ్ల కొడుకు శ్రేయాన్స్ ను చంపి, తాను ఉరి వేసుకుని తనువు చాలించాడు.
ఫ్యామిలీలోని నలుగురు బలి
హైదరాబాద్జీడిమెట్ల పీఎస్పరిధిలోని గాజుల రామారానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ఇంజినీర్ ఇప్ప వెంకటేశ్, భార్య వర్షిణి.. కొడుకు రిషికాంత్ (11), విహాంత్(3)కు విషమిచ్చి.. ఆపై వారు ఉరేసుకొన్నారు. ఆర్థిక సమస్యలతోనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియోలో వెంకటేశ్ చెప్పాడు. సూసైడ్చేసుకుంటున్న విషయాన్ని మంచిర్యాల జిల్లాలో ఉండే తండ్రి కొమురయ్యకు ఫోన్లో తెలిపాడు.
గాజుల రామారం బాలాజీ లే అవుట్సహస్ర అపార్ట్మెంట్లో మూడేండ్లుగా ఉంటున్న వెంకటేశ్ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ట్రేడింగ్చేస్తూ రూ.20 లక్షలకు పైగా నష్టపోవడమే కాక.. యాప్లోన్ల ద్వారా ఇన్స్టంట్లోన్లు తీసుకున్నట్టు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. భార్యా, పిల్లలు అనాథలవుతారనే ఉద్దేశంతో పిల్లలకు విషం ఇచ్చి అతడు, భార్య చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
బెట్టింగ్ కోసం 50 లక్షల అప్పు .. ఉరేసుకున్న సీఏ
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన శశాంక్ (35) హైదరాబాద్‌లో భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి సరదాగా ఆన్‌లైన్ గేమ్స్ మొదలుపెట్టాడు. బెట్టింగ్ స్థాయికి చేరి, లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. వాటిని తిరిగి రాబట్టుకోవడానికి అప్పులమీద అప్పులు చేయడంతో అది దాదాపు రూ.50 లక్షలకు చేరింది. మనోవేదనకు గురైన శశాంక్ మే నెల 27న ఊరికి వచ్చి కొత్త కుంటపల్లిలోని మామిడి తోటలో చెట్టుకు ఉరేసుకున్నాడు.
4 రోజుల్లో 12 లక్షలు పోవడంతో..
కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన నాగుల పృథ్వీ(25) బీటెక్ పూర్తిచేసి, యూపీలోని నోయిడాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి ఆన్ లైన్ గేమ్స్ఆడుతూ రూ.12 లక్షల వరకు అప్పు చేశాడు. 4 రోజుల్లోనే మొత్తం డబ్బులు పోవడంతో మానసికంగా కుంగిపోయాడు. జాబ్ కి వెళ్లకుండా 15 రోజులు ఒంటరిగా ఉన్నాడు. అప్పులు తీర్చలేక మే 4న ఆత్మహత్య చేసుకున్నడు.
రైలు కిందపడి.. రైల్వే ఉద్యోగి సూసైడ్
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన దేవర రాజు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా రాజు ఆన్ లైన్ బెట్టింగ్ కోసం అప్పులు చేశాడు. అందులో తేడా రావడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెందాడు. జులై 15న రఘునాథపల్లి రైల్వే స్టేషన్ లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
బెట్టింగ్ కోసం రూ.10లక్షల అప్పు..విషం తాగి సూసైడ్
సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్ పేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఈదరి నవీన్ (27) ఫర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు. ఈజీ మనీ కోసం ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసయ్యాడు. తన స్థాయికి మించి రూ.10 లక్షలు అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిషేధమున్నా ఆగని ఆన్‌లైన్ జూదం
రాష్ట్రంలో ఆన్లైన్బెట్టింగ్యాప్స్పై నిషేధమున్నా కొత్తగా రోజుకో 4 బెట్టింగ్యాప్స్పుట్టుకొస్తున్నాయి. యూట్యూబ్, సోషల్‌మీడియా, వెబ్సైట్లు ఓపెన్చేయడమే ఆలస్యం బెట్టింగ్యాప్స్ యాడ్స్ కనిపిస్తున్నాయి. ఏదైనా పెద్ద ఘటన.. లేదంటే కుటుంబ సభ్యులు వీటి బారినపడి బలైన చోట మాత్రమే ఫిర్యాదు ఆధారంగా పోలీసులు స్పందిస్తున్నారు. లేదంటే ఇది తమ పనికాదన్నట్టు లైట్తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. దీంతో ఆన్లైన్బెట్టింగ్నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఒక్కరే వివిధ పేర్లతో బిజినెస్నడిపిస్తున్నారు. కొత్త కస్టమర్లను పరిచయం చేసే రెగ్యులర్కస్టమర్లకు డబ్బుల రూపంలో కమీషన్ ఇస్తుండడంతో ఒకరిద్వారా మరొకరు రోజుకు వందలు, వేల సంఖ్యలో కొత్తగా ఆన్లైన్బెట్టింగ్స్, గేమ్స్ఆడేందుకు రెడీ అవుతున్నారు.
ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు..
ఆన్‌లైన్ బెట్టింగుల కోసం ఇంటి పేపర్లు, కార్లు, భూములు వంటి ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకుంటున్నారు. ఎక్కడా డబ్బులు పుట్టకపోతే లోన్‌యాప్స్‌లో అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారు. ఇందులో రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు అప్పులు చేసినోళ్లు కూడా ఉన్నారు. సమయానికి అసలు, కిస్తీలు కట్టకపోవడంతో అప్పులు ఇచ్చినోళ్లు, లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఇంట్లో వాళ్లకు చెప్తామని, చుట్టుపక్కల వాళ్లకు చెప్తామని, కోర్టులకు లాగుతామని బెదిరిస్తుండడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగుల కోసం దొంగతనాలు
ఆన్లైన్బెట్టింగ్ కు అలవాటుపడి అప్పులు పుట్టకపోవడంతో డబ్బుల కోసం ముగ్గురు యువకులు ఏకంగా దొంగతనాలు చేసి, పోలీసులకు చిక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వర్ధవెళ్లికి చెందిన మందల సాయి, వెంకటేశ్, వంశీ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డారు. ఈ ముగ్గురూ డబ్బులు సరిపోక రాజన్నపేటకు చెందిన ఈడుగు కనుకయ్య.. తన పొలంలో పెట్టిన ట్రాక్టర్, దానికున్న కల్టివేటర్‌తో సహా దొంగిలించారు. ఆపై బాధితుడు కేసు పెట్టడంతో పోలీసులకు దొరికిపోయారు.
బెట్టింగ్ మానట్లేదని కొడుకును హత్య చేసిన తండ్రి
ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడి కోట్లాది రూపాయలు పోగొట్టడమే కాకుండా ఆస్తులను అమ్ముతూ మాట వినడంలేదని రైల్వే ఉద్యోగి సత్యనారాయణ... తన కొడుకు ముఖేశ్ కుమార్‌ను చంపేశాడు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం భాగిర్తిపల్లిలో మే 12న ఈ ఘటన జరిగింది. క్రికెట్‌బెట్టింగ్ లో ముఖేశ్పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి, నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చేందుకు మేడ్చల్‌లోని ఇండ్లు, ప్లాట్అమ్మేశాడు. ఇప్పటికైనా బెట్టింగ్ మానుకోవాలని తండ్రి సత్యనారాయణ హెచ్చరించాడు. అయినా ముఖేశ్ తీరు మార్చుకోలేదు. అప్పటికే అతడి తీరు నచ్చక భార్య సైతం వెళ్లిపోయింది. డబ్బుల కోసం మరో ఇంటిని అమ్మాలని కొడుకు గొడవ చేయడంతో తండ్రి సత్యనారాయణ.. తన కన్నకొడుకునే కొట్టి చంపాడు.
రూ. 10 వడ్డీకి అప్పు తెచ్చి..
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్మాయలో పడ్డవారికి చేతిలో ఉండే డబ్బుల విలువ తెలియడంలేదు. ఇందులో నష్టపోయినవారిని గమనిస్తే.. మొదట్లో వందల రూపాయలతో మొదలు పెట్టే బెట్టింగ్..తర్వాత రూ.వేలు, లక్షల వరకు వెళ్తున్నది. ఒకట్రెండుసార్లు అధిక మొత్తంలో డబ్బులు రావడంతో...అత్యాశతో పెద్ద మొత్తంలో బెట్టింగ్పెట్టి అప్పుల పాలవుతున్నారు. అప్పటికే బెట్టింగ్ ఊబిలో చిక్కడంతో మామూలుగా బయట రూ.2 రూపాయల చొప్పున వడ్డీ నడిచేచోట రూ.5 నుంచి రూ.10 రూపాయల వడ్డీకి కూడా అప్పు తేవడానికి వెనకాడడం లేదు.