యాదాద్రి దర్శనం, పూజలకు ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్

 తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి టెంపుల్ లో  ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు ఆలయ అధికారులు.   భక్తులు దేవస్థాన  వెబ్ పోర్టల్  ద్వారా మే 23 నుంచి ఆన్ లైన్ బుకింగ్  చైసుకోవచ్చు.  ఇక నుంచి భక్తులు ఎవరైనా yadadritemple.telangana.gov.in web site  లో   ఒక గంట ముందు దర్శనానికి లేదా పూజా కార్యక్రమాలకు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఈవో గా భాస్కరరావు  చార్జ్ తీసుకున్న తర్వాత భారీ మార్పులు  చేస్తున్నారు.  సామాన్య భక్తులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే  యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం జూన్‌‌‌‌‌‌‌‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. 

బ్రేక్‌‌‌‌‌‌‌‌ దర్శనాలు, నిత్యకల్యాణం, జోడు సేవలు, అభిషేకాలు, వ్రతాల్లో పాల్గొనే దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు.
మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌గానీ, చీరగానీ, లంగా వోణి గానీ ధరించాలని చెప్పారు. విషయం తెలియకుండా వచ్చే వారి కోసం స్టాల్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఏర్పాటు చేయిస్తామన్నారు. అయితే ఈ డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ క్యూలైన్‌‌‌‌‌‌‌‌లో స్వామి వారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు వర్తించదన్నారు.