హైదరాబాద్ , వెలుగు: సిటీలో అడ్డగోలుగా వెలిసిన పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలపై ఫిర్యాదు చేసేందుకు జీహెచ్ఎంసీ సామాన్యులకు అవకాశం కల్పించింది. ఇప్పటివరకూ ఈవీడీఎం బృందాలు మాత్రమే ఈ పని చేస్తుండగా.. పౌరుల భాగస్వామ్యం పెంచేందుకు ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేసింది. పర్మిషన్ లేకుండా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, గోడలమీద రాసినా.. ఫొటో తీసి #cec evdmకి ట్యాగ్‌చేయాలని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి కోరారు. సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ సోషల్ మీడియా ఎంప్లాయీస్ స్పందించి, ఈ చలాన్ విధిస్తారని చెప్పారు.
For More News..