ప్లాట్ రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఇస్తానని ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మోసం

  • 18 మంది నుంచి  రూ. 5 లక్షలు వసూలు 
  • బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసిన పోలీసులు 

జీడిమెట్ల, వెలుగు: ప్లాట్ రెంట్ కు ఇస్తానని చెప్పి ఆన్ లైన్ ద్వారా రూ. 5 లక్షలు తీసుకుని 18 మందిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లి సీఐ ఉపేందర్​ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్ కి చెందిన శివశంకర్​కు బండారీ లేఅవుట్ రోడ్డు నంబర్10ఏలో ఓ ఫ్లాట్​ఉంది. సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో తన ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఇస్తానని  99 ఎకర్స్​లో  వెబ్​సైట్​లో పెట్టాడు. అతని భార్య మాధవి, అల్లుడు లోకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసి మొత్తం 18 మంది వద్ద రెండు మూడు నెలల నుంచి అడ్వాన్స్​ రూపంలో ఫోన్​ పే ద్వారా సుమారు రూ. 5 లక్షలు వసూలు చేశారు.  ప్లాట్ రిపేర్ చేయిస్తున్నా అంటూ దాటవేస్తూ...  ఎవరికీ రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు.  బాధితుల ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు శివ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.