హైదరాబాద్, వెలుగు: న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ అయిన ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీ సిల్లీ మాంక్స్ లాభాల్లోకి వచ్చింది. ఏర్పాటైన నాలుగేళ్ల తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.26.83 లక్షల ప్రాఫిట్ (ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్) సాధించామని ప్రకటించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.9.46 లక్షలు పొందామని తెలిపింది.
అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి రూ.5.52 కోట్ల నష్టం వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన బోర్డ్ మీటింగ్‌లో ఫైనాన్షియల్ రిజల్ట్స్‌ను సిల్లీ మాంక్స్ విడుదల చేసింది. కీలకమైన బిజినెస్‌లపై ఫోకస్ పెట్టామని, రెవెన్యూ పెంచుకుంటున్నామని కంపెనీ ఫౌండర్ సంజీవ్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా కంపెనీ ఈసాప్స్ (ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్) నుప్రకటించింది.