ఆన్ లైన్ పాస్ పోర్ట్ పోర్టల్ మూసివేత.. అపాయింట్ మెంట్స్ అన్నీ మారాయి..

ఆన్ లైన్ పాస్ పోర్ట్ పోర్టల్ మూసివేత.. అపాయింట్ మెంట్స్ అన్నీ మారాయి..

ఆన్లైన్ పాస్ పోర్ట్ పోర్టల్ మూతపడింది. పాస్ పోర్ట్ కోసం అప్లై చేసుకునే ఆన్లైన్ పోర్టల్ ఇవాళ ( ఆగస్టు 29, 2024 ) రాత్రి 8గంటల నుండి 5 రోజుల పాటు ముసివేయనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. ఈ ఐదు రోజుల వ్యవధిలో ( సెప్టెంబర్ 2 వరకు ) కొత్త అపాయింట్మెంట్స్ స్వీకరించబడవని తెలిపింది. ముందుగా బుక్ చేసుకున్న అపాయింట్మెంట్స్ రీషెడ్యూల్ చేయబడతాయని, మెయింటెనెన్స్ లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది ప్రభుత్వం.

ఈ క్రమంలో పోర్టల్ నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది ప్రభుత్వం. చాలా నకిలీ వెబ్‌సైట్‌లు, మొబైల్ అప్లికేషన్‌లు దరఖాస్తుదారుల నుండి డేటాను సేకరిస్తున్నాయని, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ నింపడానికి, పాస్‌పోర్ట్ మరియు సంబంధిత సేవల కోసం అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి అదనపు భారీ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.

Also Read :- సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు ఇవే

నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాస్ పోర్ట్ అప్లై చేయటం కొసం ఎక్కడా పేమెంట్స్ చేయద్దని సూచించింది. దరఖాస్తు కోసం భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ www.passportindia.gov.in ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలని తెలిపింది.