4 రోజులు ఆన్ లైన్ పాస్ పోర్టు సేవలు బంద్.. వెల్లడించిన కేంద్రం

4 రోజులు ఆన్ లైన్ పాస్ పోర్టు సేవలు బంద్.. వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఆన్ లైన్ పాస్ పోర్టు సేవలు నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పాస్​పోర్టు సేవా పోర్టల్ మెయింటెనెన్స్ కారణంగా బుకింగ్స్ నిలిపివేస్తున్నామని, అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేస్తామని వెల్లడించింది. ఈమేరకు కేంద్ర విదేశాంగ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘టెక్నికల్ మెయింటెనెన్స్ కారణంగా పాస్​పార్టు సేవా పోర్టల్ ఈ నెల 29న రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2న ఉదయం 6 గంటల వరకు అందుబాటులో ఉండదు. ఈ నెల 30 కోసం బుక్ చేసుకున్న అపాయింట్మెంట్లన్నీ రీషెడ్యూల్ అవుతాయి” అని ప్రకటనలో పేర్కొంది. కాగా, కొత్త పాస్ పోర్టులు, రెన్యూవల్ కోసం ముందుగా పాస్​పోర్టు సేవా పోర్టల్‎లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని.. ఆ తర్వాత ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.