యాదగిరిగుట్టలో ఆన్‌‌లైన్‌‌ పేమెంట్లు

యాదగిరిగుట్టలో ఆన్‌‌లైన్‌‌ పేమెంట్లు
  • గతంలో ప్రసాద, దర్శనాల టికెట్లను ఆన్‌‌లైన్‌‌ చేసిన దేవస్థానం
  • తాజాగా కొండపైకి వాహనాల ఎంట్రీ పేమెంట్‌‌కు సైతం వర్తింపు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆన్‌‌లైన్‌‌ పేమెంట్ల ప్రారంభ సేవలు స్పీడ్‌‌గా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ప్రసాద, దర్శనాల టికెట్ల పేమెంట్లను ఆన్‌‌లైన్‌‌ చేసిన ఆలయ ఆఫీసర్లు.. తాజాగా కొండపైకి వాహనాలు వెళ్లే టికెట్‌‌ పేమెంట్లలో సైతం ఆన్‌‌లైన్‌‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు కొండపైకి వాహనం వెళ్లాలంటే రూ.500 నగదు రూపంలో చెల్లించాల్సి వచ్చేది. కానీ సోమవారం నుంచి ఫోన్‌‌పే, గూగుల్ పే, పేటీఎం, యూపీఐ సేవలతో పాటు డెబిట్, క్రెడిట్‌‌ కార్డుల స్వైపింగ్‌‌ చేసి టికెట్‌‌ కొనుగోలు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 

ఈ విధానాన్ని సోమవారం ఆలయ ఈవో భాస్కర్‌‌రావు ప్రారంభించి, క్షేత్రస్థాయిలో అమలు తీరును పరిశీలించారు. మాన్యువల్‌‌ పద్ధతిలో టికెట్ల జారీలో అవకతవకలు జరిగినట్లు తేలడంతో, వాటిని అరికట్టేందుకు ఆన్‌‌లైన్‌‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.