డిసెంబర్ 5 వరకు అమెజాన్​లో వింటర్​సేల్​

డిసెంబర్ 5 వరకు అమెజాన్​లో వింటర్​సేల్​

హైదరాబాద్​, వెలుగు: ఆన్​లైన్​ షాపింగ్​ ప్లాట్​ఫామ్​  అమెజాన్​ వింటర్​ సేల్​ను ప్రారంభించింది. ఇది డిసెంబరు ఐదో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా హీటర్లు, బ్లాంకెట్స్, గీజర్లు, కిచెన్ వేర్ వంటి ప్రొడక్టులపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తారు. 

ప్రైమ్ సభ్యులకు 30 నవంబర్ అర్థరాత్రి నుంచే సేల్​ మొదలవుతుంది.  ఫిలిప్స్, హావెల్స్, బెర్జ్ నర్, లైఫ్ లాంగ్, హిట్, అగారో  వంటి ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ పైన డీల్స్ ఉన్నాయని అమెజాన్​ తెలిపింది. హెచ్ డీఎఫ్​సీ, వన్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ ఈఎంఐ కార్డ్స్ పై 10శాతం వరకు ఇన్​స్టంట్​ డిస్కౌంట్ పొందవచ్చు.