మద్యం మత్తులో చేసే పనుల కారణంగా కొందరు ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు. ఓ వ్యక్తి పీకలదాక మద్యం సేవించి ఉన్న సమయంలో కొండ చిలువ వ్యక్తిపైకి ఎక్కింది. అయినా కూడా ఆ వ్యక్తికి సోయ లేకపోవడంతో చివరికి స్థానికులు రక్షించిన ఘటన నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది.
పూర్తివివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని అవుకు మండలం సింగనపల్లికి చెందిన ఓ వ్యక్తి లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం రోజున పనికి వెళ్లొచ్చి ఫుల్ గా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఈ క్రమంలో ఇంటి అరుగుపై తూగుతూ కూర్చుని ఉన్నాడు. అయితే ఇంటి పక్కన ఉన్న పొదాల్లోంచి ఓ కొండ చిలువ ఈ వ్యక్తిపైకి ఎక్కింది.
ALSO READ | ఎంత పని చేశారురా : ప్రభుత్వం నుంచి రూ.3 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
అయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి కొండ చిలువ తనపైకి ఎక్కినట్లు కనీసం స్పర్శ కూడా లేదు. దీంతో కొండ చిలువ మెల్లమెల్లగా ఈ వ్యక్తిని చుట్టుముత్త సాగింది. ఇది గమనించిన స్థానికులు కర్రల సాయంతో కొండచిలువని తరిమేశారు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఇదంతా గమనిస్తున్న కొందరు ఈ సంఘటనని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియొ తెగ వైరల్ అవుతోంది.