హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ ఎన్ని కల ప్రచారానికి క్యాండిడేట్లు 2 వెహికల్స్ నే వాడాలని, అంతకు మించి వాడితే ప్రతి 2 వెహికల్స్ మధ్య
100 మీటర్ల దూరం పాటించాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఆదివారం ఈ మేరకు గైడ్ లైన్స్ విడుదల చేసింది. పోలింగ్ రోజు ఒక్కో క్యాండిడేట్ ఒక్క వెహికల్ వాడుకోవడానికే అనుమతిస్తామని, ఇందుకు ప్రత్యేకంగా పర్మి షన్ తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ వాహనాలను అభ్యర్థులు వాడొద్దని స్పష్టం చేశారు. ప్రచారవాహనాలకు ముం దుగానే జీహెచ్‌ఎంసీ ఎలక్షన్ అథారిటీ, డిప్యూటీ కమిషనర్ల నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నారు. పర్మి షన్ లేకుండా వెహికిల్స్ ను ఉపయోగిస్తే వాటిని సీజ్ చేసి, కేసులు పెడతామని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. పబ్లిక్ మీటింగులు, రోడ్ షోలలో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు, వేరే ప్రచార కార్యక్రమాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకే మైకులు వాడాలని తెలిపారు.