- అప్లై చేసినా పరీక్ష రాసేందుకుఆసక్తి చూపని అభ్యర్థులు
- పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అప్లై చేసుకున్నవారిలో తొలిరోజు ఆదివారం సగం మంది మాత్రమే హాజరయ్యారు. కొందరు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేక పరీక్ష రాయలేకపోయారు. ఉదయం జనరల్ స్టడీస్ కి జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 26,978అభ్యర్థులకు గాను 13273 మంది హాజరు 13,705 మంది(50.80) గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్ 2 కు హాజరు సంఖ్య మరింత తగ్గింది. 13,135 హాజరుకాగా, 13,843 మంది(51.31) ఆబ్సెంటయ్యారు.
ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాలతోపాటు ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో గల పరీక్షల కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లో అంధత్వ అభ్యర్థి సహాయకురాలి సాయంతో పరీక్ష రాస్తుండటాన్ని కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఆదివారం ఉదయం జెడ్పీ ఆఫీస్ వద్దగల స్ట్రాంగ్ రూమ్ నుంచి గ్రూప్ 2 పరీక్షల ప్రశ్నాపత్రాల తరలింపు ప్రక్రియను అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. అనంతరం అయన అల్ఫోర్స్, ఎస్ ఆర్ ఆర్ కాలేజీ, తిమ్మాపూర్ లోని జ్యోతిష్మతి కళాశాల పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.