బంపర్ ఆఫర్.. రూ.11 లతో విమానంలో విదేశాలకు టూర్..హోళీ ఆఫర్..ఒక్కరోజే ఛాన్స్..

బంపర్ ఆఫర్.. రూ.11 లతో విమానంలో విదేశాలకు టూర్..హోళీ ఆఫర్..ఒక్కరోజే ఛాన్స్..

విమానంలో ప్రయాణించాలనుకుంటున్నారా..విదేశాలకు వెళ్లొస్తే బాగుండు అనుకుంటున్నారా..అయితే మీకో బంపర్ ఆఫర్. ఓ విమానయాన సంస్థ ఈ బంపర్ ఆఫర్ ను అందిస్తోంది. స్పెషల్ సేల్స్ కోసం తక్కువ ధరల్లోనే ఫ్లైట్ టికెట్స్ ఆఫర్ చేస్తోంది. 

సాధారణంగానే ఫ్లయిట్ టిక్కెట్లు కాస్త అధికంగా ఉంటాయి. ఇంకా ప్రత్యేక సమయంలో విమాన టిక్కెట్లు ధర చెప్పనవసరం లేదు. కానీ మీరు కొన్ని విమానయాన సంస్థల టికెట్స్ గమనిస్తే మీరు తక్కువ ధరకే టిక్కెట్లను కొనవచ్చు. ఇంకా అదనంగా క్యాష్‌బ్యాక్స్, డిస్కౌంట్స్, కూపన్స్ వంటివి కూడా అందిస్తుంటాయి.

ఇటీవల వియత్నాం విమానయాన సంస్థ వియత్‌జెట్ భారతీయుల కోసం స్పెషల్ హోలీ సేల్‌ను ప్రారంభించింది. హనోయ్ కేంద్రంగా నడిచే ఈ ఏవియేషన్ సంస్థకు ఇప్పటికే లో కాస్ట్ ఎయిర్‌లైన్‌గా పేరుంది. కేవలం రూ. 11 ప్రారంభ ధరతోనే ఫ్లైట్ టికెట్స్ ఆఫర్ చేస్తోంది. రూ. 11కు అదనంగా టాక్స్‌లు, ఇతర ఫీజులు వర్తిస్తాయని తన అఫీషియల్ వెబ్‌సైట్, యాప్‌లో తెలిపింది. 

ఆఫర్ వివరాలు 

వియత్నాం భారతదేశంలోని అన్ని నగరాల నుంచి వియత్నాం నగరాలకు వెళ్లే విమానాలలోని వియత్‌జెట్ ఈ సేల్ అమలు చేసింది. ఇందులో వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీ రూ.11 నుంచి ప్రారంభమవుతుంది. అయితే టికెట్ ఛార్జ్ మొత్తానికి అదనంగా పన్నులు ఇంకా ఇతర విమానాశ్రయ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ ప్రస్తుతం అందరికి అందుబాటులో ఉంది ఇంకా 28 ఫిబ్రవరి 2025 వరకు కొనసాగుతుంది. ఈ ఆఫర్ కింద మార్చి 10 నుండి సెప్టెంబర్ 30, 2025 మధ్య ప్రయాణం చేయవచ్చు అంతేకాదు ఈ అఫర్ భారతదేశం నుండి వియత్నాంకు వెళ్లే అన్ని రూట్లలో వర్తిస్తుంది.