కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో వరంగల్ నుంచి నలుగురే..

  • ఓసీ కోటాలో ఇద్దరు, ఎస్సీ, ఎస్టీ కోటాలో ఒక్కొక్కరికి కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌
  • ములుగులో సీతక్క, స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో ఇందిర
  •  మొదటి జాబితాలో సీనియర్లకు దక్కని ఛాన్స్‌‌‌‌‌‌‌‌

వరంగల్‍/మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌/ జనగామ, వెలుగు :  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన నలుగురి పేర్లే కనిపించాయి. జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో నలుగురికే చాన్స్‌‌‌‌‌‌‌‌ దక్కింది. ఇందులో భూపాలపల్లి, ములుగు, వరంగల్‌‌‌‌‌‌‌‌, జనగామ జిల్లాలో ఒక్కో సీటును కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌ చేశారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌, హనుమకొండ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఒక్క సీటును కూడా ఖరారు చేయలేదు. కాగా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో తప్పనిసరిగా పేరు ఉంటుందని ఆశించిన సీనియర్లకు నిరాశే మిగిలింది. 

ఓసీ కోటాలో రెండు,  ఎస్సీ, ఎస్టీ కోటాలో ఒక్కొక్కటి

ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఓసీ కోటాలో రెండు సీట్లు కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌ చేయగా, ఎస్సీ, ఎస్టీ కోటాలో ఒక్కో టికెట్‌‌‌‌‌‌‌‌ ఖరారు చేసింది. ఓసీ కోటాలో భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డికి టికెట్లు దక్కగా, ఎస్టీ కోటాలో ములుగు నుంచి ధనసరి సీతక్క, ఎస్సీ కోటాలో స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌ సింగపురం ఇందిరకు దక్కింది. 

ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో సీనియర్లకు నిరాశ

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో కొందరు సీనియర్లకు నిరాశే మిగిలింది. సీనియర్‌‌‌‌‌‌‌‌ లీడర్లు అయిన కొండా సురేఖ దంపతులిద్దరూ ఈ సారి టికెట్లు ఆశించడంతో వరంగల్‌‌‌‌‌‌‌‌ తూర్పు, పరకాల నియోజకవర్గం నుంచి ఎవరో ఒకరి పేరు ఉంటుందని ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉంటుందని అంతా భావించారు. కానీ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఎవరి పేరు కూడా లేకపోవడంతో వారి వర్గీయులు డిసప్పాయింట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నాయిని రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పేరు కూడా లిస్ట్‌‌‌‌‌‌‌‌లో కనిపించలేదు. మానుకోట జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులను ఖరారు చేయలేదు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ టికెట్‌‌‌‌‌‌‌‌ కోసం చాలా మంది అప్లై చేసుకున్నా ప్రధాన పోటీ మాత్రం కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాంనాయక్, డాక్టర్‌‌‌‌‌‌‌‌ మురళీ నాయక్‌‌‌‌‌‌‌‌ మధ్యే ఉంది. డోర్నకల్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం నుంచి జాటోతు రామచంద్రు నాయక్, మాలోతు నెహ్రూ నాయక్‌‌‌‌‌‌‌‌, కిసాన్‌‌‌‌‌‌‌‌ పరివార్‌‌‌‌‌‌‌‌ సంస్థ వ్యవస్థాపకుడు నూనావత్‌‌‌‌‌‌‌‌ భూపాల్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌ అప్లై చేసుకున్నారు. కానీ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఎవరికీ టికెట్‌‌‌‌‌‌‌‌ దక్కలేదు.

పెండింగ్‌‌‌‌లో జనగామ, పాలకుర్తి 

జనగామ జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ను కన్ఫర్మ్‌‌‌‌ చేసిన కాంగ్రెస్‌‌‌‌ జనగామ, పాలకుర్తిని పెండింగ్‌‌‌‌లో పెట్టింది. జనగామ నియోజకవర్గ టికెట్‌‌‌‌ను టీపీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య, డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్‌‌‌‌రెడ్డి ఆశించారు. కానీ టికెట్‌‌‌‌ రావడం లేదన్న కారణంతో పొన్నాల ఇటీవల కాంగ్రెస్‌‌‌‌కు రాజీనామా చేశారు. దీంతో కొమ్మూరికి లైన్‌‌‌‌క్లియర్‌‌‌‌ అయినట్లేనని, ఫస్ట్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లోనే ఆయన పేరు ఉంటుందని అంతా భావించారు. కానీ జనగామ క్యాండిడేట్‌‌‌‌ను కన్ఫర్మ్‌‌‌‌ చేయకుండా పార్టీ పక్కన పెట్టింది. మరో వైపు పాలకుర్తి నియోజకవర్గంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి టికెట్‌‌‌‌ ఖరారు అయినట్లు తెలుస్తున్నా ఫస్ట్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.