ఎన్నికల ప్రచారం ముగిసేది రేపే

ఎన్నికల ప్రచారం ముగిసేది రేపే
  • పెద్ద లీడర్ల సభలప్పుడే సందడి.. చివరి దశలో కనిపించని మోడీ, రాహుల్​
  • నేడు వికారాబాద్ లో కేసీఆర్​ సభ.రేపు శంషాబాద్ లో అమిత్ షా మీటింగ్  

రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి మిగిలింది ఇంకా 27 గంటలే ఉంది. మంగళవారం సాయంత్రం5 గంటలతో క్యాంపెయిన్​ క్లోజ్ కానుంది. సమయం తక్కువగా ఉండటంతో దాన్ని వినియోగిం చుకోవాలని అభ్యర్థులు ప్లాన్​ చేసుకుంటున్నారు . అయితే .. ఎన్నికల షెడ్యూల్​ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రం లోపెద్దగా ప్రచార హడావుడి కనిపించడం లేదు. అక్కడక్కడ.. అదీ పార్టీల పెద్ద లీడర్లు ప్రచారంలో పాల్గొ న్నచోట తప్ప మిగతా ప్రాంతాల్లో చప్పగా సాగిపోతున్నది.మోడీ రెండు సార్లు, రాహుల్​ఒక్కసారి మాత్రమే రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొన్నారు. అటు తర్వాత వాళ్ల సభల ఊసేలేదు. చివరి దశ ప్రచారంలో నైనా పాల్గొం టారను కుంటే అదీ లేదు. జాతీయస్థాయి పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో తొలిదశ ప్రచారంతోనే ఇక చాలనుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఏడు దశల్లో జరిగే లోక్ సభఎన్నికల్లో రాష్ట్రంలో మొదటి దశ (ఈ నెల 11న)లోపోలింగ్​ జరుగనుంది. ఈ నెల 9న ప్రచారం ముగియనుంది. సోమవారం ఉదయం 6 గంటల నుం చి రాత్రి 10 గంటల వరకు, మంగళవారం ఉదయం 6గంటల నుం చి సాయంత్రం 5 గంటల వరకు.. అంటే 27గంటలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది. అటుతర్వాత ఎక్కడి మైకులు అక్కడ మూగబోనున్నాయి.

ఒకే టూర్తో రాహుల్సరి

రాష్ట్రంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలుదఫాలుగా సుడిగాలి పర్యటనలు చేపట్టిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ.. తన రాజకీయ భవిష్యత్తుకు కీలకమైన ఈ ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంపై పెద్దగా దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ 1న కేవలం ఒకేఒక్కసారి రాష్ట్రానికి వచ్చారు. అప్పుడు జహీరాబాద్,నాగర్ కర్నూల్, హుజుర్ నగర్ సభల్లో పాల్గొన్నారు. అటు తర్వాత ఆయన సభలు లేవు. సోమవారం రెండో దఫా రాహుల్ టూర్ ఉంటుందని, భువనగిరి,మహబూబాబాద్​, పెద్దపల్లిలో సభల్లో పాల్గొంటారని రాష్ట్ర కాంగ్రెస్ భావించింది. రాహుల్ కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఆ టూర్ రద్దయింది. ఒకే ఒక్క టూర్ తో తెలంగాణ ఎన్నికలప్రచారాన్ని రాహుల్ ముగించడం రాష్ట్ర కాంగ్రెస్ లోచర్చకు దారితీసింది. మరో వైపు నల్గొండలో పోటీచేస్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌ రెడ్డి ఆ నియో-జకవర్గానికే పరిమితమయ్యారు. ఫలితంగా స్టార్‌‌‌‌ క్యాంపెయినర్లతో నే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంసాగి పోతున్నది. కొందరు అభ్యర్థులైతే గడువు ముగుస్తుండటంతో ఎవరినీ నమ్ముకోకుండా సొంతంగా ప్రచారంలో పాల్గొంటున్నా రు.

రెండు సభలకే మోడీ

బీజేపీ తరఫున ప్రధాని మోడీ రాష్ట్రంలో రెండు సభల్లో నే పాల్గొన్నారు. మార్చి 29న మహబూబ్‌ నగర్‌‌‌‌ సభకు, ఏప్రిల్ 1న హైదరాబాద్‌ సభకు హాజరయ్యారు. తర్వాత ఆయన పర్యటనలు లేవు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మూడు నాలుగు సభల్లో పాల్గొన్న మోడీ..ఇప్పుడు రెండు సభలతో సరిపెట్టు కున్నారు. చివరిదశలోనైనా ఆయన పర్యటన ఉంటుందని బీజేపీక్యాడర్ ఆశించినా ఫలితం లేదు. ఇక ఆ పార్టీ జాతీయఅధ్యక్షుడు అమిత్​ షా నిజామాబాద్​ సభకు హాజరుకాగా..కరీంనగర్ , వరంగల్ సభలు రద్దయ్యాయి.అయితే.. మంగళవారం శంషాబాద్​లో జరిగే సభలోమాత్రం ఆయన పాల్గొననున్నారు. స్టార్‌‌‌‌ క్యాంపెయినర్లుగా కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌‌‌‌ సింగ్‌‌‌‌, సుష్మాస్వరాజ్‌ , పురుషోత్తం రూపాలాతో పాటు యూపీ సీఎంయోగి ఆదిత్యానాథ్‌‌‌‌ ప్రచారంలో పాల్గొంటున్నారు.

ప్రచారానికి కేసీఆర్‌ , కేటీఆర్

తన పార్టీ అభ్యర్థుల తరఫున సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రచారంలో జోరుగా సాగి పోతున్నారు. ఆదివారం వరకుఆయన 13 సభలకు హాజరయ్యారు. మల్కాజ్​గిరి,సికింద్రాబాద్‌ మినహా అన్ని స్థానాలను కవర్‌‌‌‌ చేశారు.చివరగా సోమవారం చేవెళ్ల లోక్ సభ పరిధిలోని వికారాబాద్‌ సభకు హాజరుకానున్నా రు. పార్టీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌‌‌ కూడా విస్తృ తంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో సభలు, సమావేశాల్లోచురుకుగా పాల్గొంటున్నారు. చివరి దశలో ఆయనఎక్కువగా రోడ్‌ షోల్లో పాల్గొనే అవకాశం ఉంది.