ఆ ఊళ్లో ఒకే ఒక్క కుటుంబం…మేం ఈడనే ఉంటం

ఆ ఊళ్లో ఒకే ఒక్క కుటుంబం…మేం ఈడనే ఉంటం

ఊరంతా ఖాళీ అయినా కోరేంగా గోవిందరావు, మారుబాయి దంపతులు మాత్రం ఊళ్లోనేఉంటున్నారు. ఆ దట్టమైన అడవిలో గుట్టలమధ్య ఒకే కుటుం బం. వాళ్లే ఆ అడవి సంపదను, వాళ్ల ఊరిని కాపాడుతున్నారు. ‘మేం కూడా పోతే అడవి తల్లిని చూసుకునేటోళ్లే ఉండరు.అందుకే ఎంత కష్టమొచ్చినా ఈడనే ఉంటున్నం .ఇరవై ఏళ్ల కింద అందరం కలిసి ఎన్నో మొక్కలు నాటినం. కానుగ నూనెతో కరెంట్ కూడాతయారు చేసుకున్నం . అందుకే పెద్దపెద్దోళ్లు అమెరికాకెల్లి మా ఊరికి వచ్చిం డ్రు. కానీ,తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినయ్ . అంత మాత్రాన ఊరు విడిచి పోతమా? ఈడనే ఉండి మేం పెంచిన చెట్లను చూసుకుంటం. అందరూ ఊరికి వస్తే బాగుం డు. పాత రోజులు ఎప్పుడొస్తయో.. ఏమో’ అంటున్నారు ఈ దంపతులు.

అంతర్జా తీయ గుర్తింపు….

చాల్ బాడి.. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో ఒక చిన్న పల్లె. కొన్నేళ్ల క్రితం ప్రపంచం చూపును తనవైపు తిప్పుకుంది. ఇప్పడు మాత్రం ఖాళీ ఇళ్లతో బోసిపోయింది. ఈ గ్రామం చుట్టూ కానుగ చెట్లు ఉన్నాయి.దాంతో ఐటీడీఏ కానుగ నూనెతో విద్యుత్ ఉత్పత్తి చేసే జనరేటర్ ను ఆ గ్రామస్తులకు ఇచ్చింది. చెట్ల నుంచి సేకరించి న కానుగ విత్తనాలతో నూనె తయారు చేసి జనరేటర్‌‌‌‌లో పోసి విద్యు త్ ఉత్పత్తి చేసుకునేవాళ్లు. ఆ విద్యు త్ ఊళ్లోని పదిహేను కుటుం బాలకు సరఫరా అయ్యేది. ఇది ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సొంతంగా కరెంట్ ఉత్పత్తి చేసుకున్న మొదటి గ్రామం. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడంతో అమెరికాకు చెం దిన ఒక స్వచ్ఛంద సంస్థ 2000 సంవత్సరంలో అంతర్జా తీయ స్థాయి అవార్డు కూడా ఇచ్చిం ది. అయితే, తర్వాత కొంత కాలానికి ఊళ్లో కుటుం బాలు వలస బాట పట్టడంతో ఐటీడీఏ ఇచ్చిన జనరేటర్‌‌‌‌ను తిరిగి తీసుకుంది.

ముప్పై వేల మొక్కలు….

ఈ గ్రామస్తుల స్ఫూర్తిని చూసి వాళ్ల అభివృద్ధి కోసం ఐటీడీఏ అప్పటి ప్రాజెక్టు అధికారి నవీన్ మిట్టల్ పన్నెం డు లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఆ డబ్బుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో రాళ్ల కట్టలు, వాటర్ షెడ్లు నిర్మించారు. నీటి గుంటలు, కందకాలు, ఊట కుంటలు తవ్వించారు. నర్సరీ ఏర్పాటు చేశారు. భూగర్భ జలాలు కూడా బాగా పెరిగాయి. తర్వాత గ్రామస్తులు అంతా కలిసి ఊరి చుట్టూ సుమారు ముప్పై వేల మొక్కలు నాటారు. అందులో కానుగ, ఉసిరి, చింత, వెదురు, అడవి ఆముదం, ఔషధ మొక్కలే ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ ఇప్పడు పెద్ద చెట్లు అయ్యాయి.

అభివృద్ధి కోసం కమిటీ….

ఈ ఊళ్లో మహిళలంతా కలిసి గ్రామాభివృద్ధి కోసం 2003లో ‘ఆవ్వల్ ’ అనే పేరుతో ఒకకమిటీని ఏర్పా టు చేసుకున్నారు. గ్రామానికి అంతర్జా తీయ అవార్డు వచ్చినప్పడు ప్రోత్సాహకంగా అధికారులు రెండు లక్షల రూపాయలు ఇచ్చారు. వాటితో ఆవ్వల్ కమిటీ సభ్యులు ఒక ట్రాక్టర్ ను కొన్నారు. దానిపై వచ్చే ఆదాయాన్ని గ్రామంలో అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు.