
ఐపీఎల్ లో వీకెండ్ వచ్చిందంటే క్రికెట్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఖాయం. శనివారం, ఆదివారం రెండు మ్యాచ్ లు జరగడమే ఇందుకు కారణం. రెండు రోజులు మొత్తం నాలుగు మ్యాచ్ లు అభిమానులకు మంచి కిక్ ఇస్తాయి. ఈ రెండు రోజులు డబుల్ హెడ్డర్ ఉండడంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తారు. అయితే క్రికెట్ అభిమానులకు ఇక నుంచి చిన్న షాక్. ప్రస్తుత సీజన్ లో ఇకపై శనివారం ఒకటే మ్యాచ్ జరగనుంది. గత మూడు వారాలుగా రెండు మ్యాచ్ లు చూస్తూ ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ కు ఇది ఒకరకంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఆటగాళ్లు అలసిపోకుండా ఉండాలని.. టోర్నీ చివరి దశలో అన్ని జట్లకు రెస్ట్ అవసరమని భావిస్తూ ఐపీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం మాత్రమే ఎప్పటిలాగే రెండు మ్యాచ్ లు జరుగుతాయి. ఈ సీజన్ లో ఒక ఆదివారం మాత్రమే ఒక మ్యాచ్ నిర్వహించాల్సి వచ్చింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. (ఏప్రిల్ 6) మధ్యాహ్నం కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ శ్రీరామ నవమి పండుగ కారణంగా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. కోల్కతాలో శ్రీరామ నవమి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించే అవకాశం ఉండటంతో.. అటు ఊరేగింపు వేడుకలకు.. ఇటు మ్యాచుకు బందోబస్తు ఇవ్వడం కష్టమని కోల్కతా పోలీసులు ఐపీఎల్ మ్యాచుకు అనుమతి నిరాకరించారు.
Also Read:-ఐపీఎల్ కోసం హనీమూన్ వద్దనుకున్న సన్ రైజర్స్ మ్యాచ్ విన్నర్
నేడు ఐపీఎల్ లో శనివారం (ఏప్రిల్ 26) కోల్ కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు కేకేఆర్ కు అత్యంత కీలకంగా మారింది. మరోవైపు పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ లో ముందుకెళ్లాలని భావిస్తుంది. రేపు ఆదివారం (ఏప్రిల్ 27) యధా విధిగా రెండు మ్యాచ్ లు జరుగుతాయి. మధ్యాహ్నం మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ తో ముంబై ఇండియన్స్.. సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి.