రాజ్యసభలో ఒకే ఒక ఎంపీకి 100 శాతం అటెండెన్స్

రాజ్యసభలో ఒకే ఒక ఎంపీకి 100 శాతం అటెండెన్స్

రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యే సభ్యుల సంఖ్యను మొదటిసారి లెక్కించారు. చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశాలతో.. గత ఏడు సమావేశాల పనితీరును అధికారులు లెక్కించారు. దీని ప్రకారం సభకు ప్రతిరోజూ 78శాతం మంది హాజరవుతున్నట్లు తేలింది. అందులో 30శాతం మంది ప్రతిరోజూ క్రమం తప్పకుండా వస్తున్నట్లు వెల్లడైంది. 2019 నుంచి 2021 మధ్యకాలంలో జరిగిన 248వ సమావేశం నుంచి 254వ సమావేశం వరకు జరిగిన 138 సిట్టింగ్ ల లెక్కలను ఇప్పుడు విశ్లేషించారు. ఏడు సమావేశాల్లో తాజాగా ముగిసిన 254వ సమావేశానికి గరిష్ఠంగా 82.57శాతం మంది సభ్యులు రోజూ హాజరయ్యారు. ఏడు సమావేశాలకు 29.14శాతం మంది సభ్యులు ప్రతిరోజూ హాజరయ్యారు. కేవలం 1.90శాతం మంది పలు కారణాల వల్ల ఒక్క రోజూ కూడా సభకు రాలేదు.

251వ సమావేశాల సమయంలో 34 మంది సభ్యులు అంటే 15.27 శాతం మంది ప్రతిరోజూ హాజరయ్యారు. 254వ సమావేశాల నాటికి ఆ సంఖ్య 98 అంటే 46శాతానికి చేరింది. AIADMK పార్టీకి చెందిన 75 ఏళ్ల సభ్యుడు ఎస్ ఆర్  బాలసుబ్రమణ్యం 7 సమావేశాల్లో 138 రోజూలూ సభకు హాజరైన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన టీజీ వెంకటేష్, మరో అయిదుగురు సభ్యులు ఆరు సమావేశాలకు అన్ని రోజులు హాజరయ్యారు. ఏపీకే చెందిన కనకమేడల రవీంద్రకుమార్, మరో ఏడుగురు 5 సమావేశాలకు పూర్తిగా వచ్చారు. 

see more news

ఈమె నోరు విప్పడం వల్లే ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఆగిపోయాయా?

ఆన్‌లైన్‌ గేమ్స్​ ఆడొద్దన్నందుకు​ స్టూడెంట్​ సూసైడ్