యాదాద్రి భువనగిరి : యాదాద్రి కొండపైకి ఇకపై కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో గీతారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి కొండ పైకి ప్రైవేటు వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులను కొండపైకి తరలిస్తామని ఈవో వెల్లడించారు. కొండపైకి వెళ్లేందుకు కిందకు వచ్చేందుకు భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.
యాదాద్రి ఆలయంలో త్వరలోనే అన్ని రకాల సేవలు ప్రారంభించనున్నట్లు ఈవో ప్రకటించారు. స్వామి వారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంతో పాటు మొక్కు జోడు సేవలు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.