ఇంఫాల్: బీజేపీ ప్రభుత్వ పథకాల వల్ల దేశంలో ఇద్దరు ముగ్గురు బడా ఇండస్ట్రీయలిస్టులే ప్రయోజనం పొందుతున్నారన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కేడర్ ను జోష్ పెంచేందుకు ఆమె సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మంగళవారం అసెంబ్లీ మణిపూర్ లోని కాంగ్రెస్ ర్యాలీలో వర్చువల్ గా ప్రసంగం చేశారు ప్రియాంక గాంధీ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం ఎలాంటి పాలసీలు లేవన్నారు. తనకు అనుకూలమైన ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామికవేత్తలకు మరింత సంపద దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. మణిపూర్ లో ఎంఎస్ఎంఈలు బతలోపేతం కాగానే.. భారీగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రియాంక గాంధీ.
ఇవి కూడా చదవండి
దేనికైనా సిద్ధమైనోళ్లం.. నీ కేసులకు భయపడ్తమా?
సంసద్ టీవీ యూట్యూబ్ చానల్ హ్యాక్
దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ దోషి