ట్విట్టర్ ను చేజిక్కించుకున్న నాటి నుంచీ ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్.. రిస్క్ అని తెలిసినా కొన్ని డిఫరెంట్ డెసీషన్స్ తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. రోజుకో కొత్త ట్వీట్ తో ట్విస్టులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో కండక్ట్ చేసే పోల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వెరిఫైడ్ ఖాతాలే అర్హులంటూ మస్క్ స్పష్టం చేశారు.
ట్విట్టర్ లో పోల్స్ పెడితే ఇప్పటివరకు ఎవరు పడితే వారు, ఎప్పుడంటే అప్పుడు ఓటు వేసేవారు. ఇక నుండి ఆ పద్దతికి కాలం చెల్లిపోయింది. కేవలం బ్లూ టిక్ ఉన్న ఖాతాల వారే ఓటెయ్యడానికి సాధ్యమవుతుందని ట్విట్టర్ అధినేత మస్క్ వెల్లడించారు. ఇది ఏప్రిల్ 15 నుండి అమల్లోకి రానుందన్నారు. ట్విట్టర్ పోల్స్‌లో పాల్గొనాలంటే ఓన్లీ వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతాలు మాత్రమే ఓటు వేయడానికి అర్హులని మస్క్ మార్చి 27న వెల్లడించారు. ఓటెయ్యాలంటే బ్లూ టిక్ కావాలి. బ్లూ టిక్ రావాలంటే.. సబ్ స్క్రిప్షన్ ను ఎంచుకొని, చెల్లించాలి. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నమాట. ఏప్రిల్ 15నుంచి ట్విట్టర్ లో ఎవరు పోల్ కండక్ట్ చేసినా.. అకౌంట్ వైరిఫైడ్ అయి ఉండాలన్న మాట.