నాలుగేళ్ల క్రితం నయనతార హీరోయిన్గా వచ్చిన ‘కర్తవ్యం’ (తమిళంలో ఆరమ్) సినిమాని అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమాలోని కంటెంటే అందుకు కారణం. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఓ చిన్నారి, కలెక్టర్ చొరవతో ఎలా బయటపడిందనేది కథాంశం. ఫైట్లు, కామెడీ ట్రాక్‌లు, అనవసర కమర్షియల్ హంగులేవీ లేకున్నా.. ఈ సినిమా ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ చక్కని విజయాన్ని సాధించింది. ఎక్కడ ఏ పిల్లాడు బోరు బావిలో పడినా వెంటనే ప్రజలు ఈ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీక్వెల్లో నయనతార నటించడం లేదని, ఆ స్థానంలో కీర్తి సురేష్ ని తీసుకున్నారనే వార్తలు తెరపైకొచ్చాయి. పైగా ఈ సినిమాకి నయనతార డేట్స్ ఇవ్వని కారణంగానే మరో హీరోయిన్ని తీసుకున్నారనే ప్రచారమూ సాగుతోంది. దీంతో దర్శకుడు గోపి నైనార్ స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ‘ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టిస్తారో అర్థం కావడం లేదు. ‘ఆరమ్’ సీక్వెల్ కి నయనతార డేట్స్ ఇవ్వలేదనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దు. ఆ సినిమాకి సీక్వెల్ అంటూ తీస్తే అది కచ్చితంగా నయనతారతోనే’ అంటూ అసలు విషయం రివీల్ చేశాడు. ప్రస్తుతానికి దేశంలో పరిస్థితి బాలేదు కనుక సీక్వెల్ గురించి ఇప్పుడే అప్డేట్స్ ఇవ్వలేను అన్నాడు.
సీక్వెల్ తీస్తే నయనతారతోనే..
- Upcoming Movies List
- June 27, 2020
లేటెస్ట్
- ప్రియాంక స్త్రీశక్తి, రాహుల్ యువశక్తి..కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రశంస
- తండేల్ హైలెస్సో హైలెస్సా
- మూడో షెడ్యూల్‌కు ముహూర్తం
- అందరూ అభివృద్ధి చెందితేనే.. నిజమైన డెవలప్మెంట్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- గ్రామంలో మద్యం అమ్మితే రూ. 25వేల జరిమానా తీర్మానం
- యువతకు స్ఫూర్తి నేతాజీ .. జనవరి 23 సుభాష్ చంద్రబోస్ జయంతి
- ఆర్చర్ చికితకు రూ. 10 లక్షల స్పోర్ట్స్ స్కాలర్షిప్
- ఈసారి జీడీపీ గ్రోత్ 6.5–6.8 శాతం
- అన్నారం ఆయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం
- తలసేమియా బాధితుల కోసం యుఫోరియా మ్యూజికల్ నైట్
Most Read News
- ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే
- మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా
- WHOకు గుడ్ బై.. వర్క్ ఫ్రం హోం రద్దు.. అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు : ట్రంప్ సంచలన నిర్ణయాలు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
- సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
- Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి
- IND vs ENG: నలుగురు పేసర్లతో బట్లర్ సేన.. భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
- ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు వీలు లేదు: బీసీసీఐ
- హైదరాబాద్‌లో రైల్వే పట్టాలపై ఓయూ విద్యార్థిని ఆత్మహత్య