క్వీన్స్‌టౌన్: వచ్చే నెలలో జరిగే విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌కు ప్రిపేర్ అవడమే టార్గెట్‌గా న్యూజిలాండ్‌తో ఆరు మ్యాచ్‌ల లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌కు ఇండియా రెడీ అయింది. ఇందులో భాగంగా బుధవారం కివీస్‌తో జరిగిన తొలి, ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ కు మంచి ఆరంభం దక్కలేదు. హర్మన్‌ప్రీత్ కౌర్, షెపాలీ వర్మ తక్కువ రన్స్ కే ఔట్ కావడంతో .. తర్వాత వచ్చిన ప్లేయర్లందరూ వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన ఇండియా ఉమెన్స్ 137 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో దీంతో 18 రన్స్ తేడాతో సొంతగడ్డపై విక్టరీ కొట్టింది న్యూజిలాండ్.
కివీస్ తో 5 వన్డేల సిరీల్ భాగంగా ఫస్ట్ వన్డే ఫిబ్రవరి -12న ఉదయం 3-30 క్వీన్స్‌టౌన్ లో జరగనుంది. వన్డే వరల్డ్‌కప్ దృష్ట్యా ఇక్కడి కండీషన్స్‌కు అలవాటు పడాలని ఇండియా ప్లేయర్లు భావిస్తున్నారు. ఈ ఆరు మ్యాచ్‌లను ఉపయోగించుకొని వరల్డ్ కప్‌లో ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగాలో డిసైడ్ అవుతామని వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. ఈ క్రమంలోనే పలువురు ప్లేయర్లను ఇండియా పరీక్షించనుంది. ఇక, విమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో సత్తా చాటిన టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అదే సక్సెస్‌ను ఇక్కడా చూపించి టీమ్‌ను ముందుండి నడిపించాలని చూస్తోంది.
ONLY WT20I. New Zealand Women Won by 18 Run(s) https://t.co/82qrzAX2TX #NZWvINDW
— BCCI Women (@BCCIWomen) February 9, 2022