నాలుగు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. 8 మంది ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్

నాలుగు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. 8 మంది ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్

న్యూఢిల్లీ: ఢిల్లీలో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 8 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బైకి చెప్పి బీజేపీలోకి జంప్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆప్ పార్టీ సిద్ధాంతాలు పూర్తిగా పక్కతోవ పట్టాయని, అవినీతి పెరిగిపోయిందని.. అందుకే బీజేపీలో చేరుతున్నామని ఈ ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా చెప్పారు.

అయితే.. ఈ 8 మంది ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ నిరాకరించింది. వందన గౌర్, రోహిత్ మెహ్రౌలియా, గిరీష్ సోనీ, మదన్ లాల్, రాజేశ్ రిషి, బీఎస్ జూన్, నరేష్ యాదవ్, పవన్ శర్మ బీజేపీలో చేరిపోయారు. అసెంబ్లీ స్పీకర్కు ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖలను పంపించారు.

ALSO READ | ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్.. ప్రజలను నిరాశపరిచింది: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం

ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపునకు ఆమ్​ఆద్మీ పార్టీ శాయశక్తులా ప్రయత్నం చేస్తోంది. ప్రజలకు చేరువయ్యేందుకు సెప్టెంబర్ 1వ తేదీ, 2024 నుంచే 'మీ ఎమ్మెల్యే, మీ ఇంటి వద్దకు' (ఆప్ కా విధాయక్, ఆప్ కే ద్వార్) పేరిట ప్రచారాన్ని ప్రారంభించింది.