Ooru Peru Bhairavakona OTT: OTTకి వచ్చేస్తున్న ఊరు పేరు భైరవకోన.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep kishan) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona). క్రియేటీవ్ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్(VI Anand) తెరకెక్కించిన ఈ సినిమాలో వర్ష బోళ్ళమా, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. ఫాంటసీ ఎలిమెంట్స్ అండ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ముందునుండి మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక టీజర్, ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. దాంతో ఫిబ్రవరి 16న రిలీజై ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. 

ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. కథ పాతదే అయినప్పటికీ.. దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం కొత్తగా ఉండటంతో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ మూవీ. నిజానికి ఈ సినిమాకు రిలీజ్ రోజు నెగిటీవ్ టాక్ వచ్చింది.. అయినప్పటికి మంచి వసూళ్లు సాధించి సందీప్ కిషన్ కు చాలా కాలం తరువాత మంచి విజయాన్ని అందించింది. విడుదలైన 10 రోజుల్లోనే రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలకు మోస్తారు లాభాలు తెచ్చిపెట్టింది. 

ఇక తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకోవడంతో.. ఓటీటీ రిలీజ్ పై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఊరు పేరు భైరవకోన డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను మార్చ్ 15 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. అంటే థియేటర్ లో రిలీజైన నెలరోజులకు ఓటీటీకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ విషయం త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి థియేటర్స్ లో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.