అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఉంటేనే ఓపీ

అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఉంటేనే ఓపీ

నిమ్స్‌‌‌‌‌‌‌‌లో పేషెంట్ల రష్‌‌‌‌‌‌‌‌ తగ్గించేందుకు చర్యలు

ఆస్పత్రిలో కరోనా కేసులు పెరగడంతో అలర్ట్‌‌‌‌‌‌‌‌

ఇప్పటికే తొమ్మిది మంది డాక్టర్లకు పాజిటివ్‌‌‌‌‌‌‌‌

ఇంకొందరు క్వారంటైన్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఓపీపై ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌

కార్డియాలజీ విభాగం ఖాళీ.. ఓపీ నిలిపివేత?

హైదరాబాద్, వెలుగు: నిమ్స్‌‌ హాస్పిటల్‌‌లో కరోనా కేసులు పెరగడంతో అధికారులు అలర్ట్​ అయ్యారు. ఔట్​పేషెంట్ల రష్‌‌ తగ్గించాలని, ఆన్​లైన్లో అపాయింట్‌‌మెంట్‌‌ తీసుకొని వచ్చే విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌‌లో నిమ్స్ యాప్‌‌ అందుబాటులో ఉందని, దాని ద్వారా అపాయింట్‌‌మెంట్ తీసుకుని వస్తే కరెక్టు టైంలో వైద్య సేవలు అందిస్తామని చెప్తున్నారు. వాస్తవానికి నిమ్స్‌‌లో లాక్​డౌన్​ టైంలోనే టెలి మెడిసిన్‌‌ సేవలు మొదలుపెట్టారు. ఇక నిమ్స్​లో కొందరు డాక్టర్లకు కరోనా రావడం, మరికొందరు క్వారంటైన్​కు వెళ్లడంతో ట్రీట్​మెంట్​ చేసేందుకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఓపీపై ఈ ఎఫెక్ట్​ పడింది. గురువారంతో పోలిస్తే శుక్రవారం సగం మందే వచ్చారు. ఆన్‌‌లైన్‌‌లో స్లాట్‌‌ బుక్‌‌ చేసుకొని వచ్చిన వాళ్లకు ప్రాధాన్యమిచ్చారు. నేరుగా ఆస్పత్రికి వచ్చిన వాళ్లలో కొందరికే సేవలందాయి.

కార్డియాలజీ ఖాళీ

నిమ్స్‌‌లో కరోనా వచ్చిన డాక్టర్లలో కార్డియాలజీ విభాగం వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఈ విభాగంలోని 50 శాతం మంది క్వారంటైన్‌‌కు వెళ్లడంతో ట్రీట్‌‌మెంట్‌‌ చేసే వాళ్లు కరువయ్యారు. ఆ సెక్షన్‌‌లో వారం పాటు ఓపీ సేవలు నిలిపేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ విభాగానికి చెందిన కొందరు ఇన్ పేషెంట్లను వేరే ఆస్పత్రులకు పంపారు. అత్యవసరనుకున్న వాళ్లకు వెంటిలేటర్‌‌పై పెట్టి ట్రీట్‌‌మెంట్‌‌ అందిస్తున్నారు. శుక్రవారానికి కార్డియాలజీ విభాగంలో ప్రస్తుతం ఒక్క పేషెంటే ఉన్నట్టు సమాచారం.

రోగులు, సిబ్బందిలో భయం

కార్డియాలజీ విభాగంలో డాక్టర్లు, సిబ్బందితో పాటు రోగులకూ కరోనా సోకడంతో మిగతా రోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. జాగ్రత్తలు తీసుకునే డాక్టర్లకే కరోనా సోకిందంటే మా పరిస్థితేంటని వాపోతున్నారు. మరోవైపు పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వట్లేదని సెక్యూరిటి సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు అంటున్నారు. వార్డుల్లోకి రోగులను తీసుకెళ్తున్నామని, వార్డులను క్లీన్ చేస్తున్నామని, కరోనా వచ్చిన వార్డుల్లో కూడా పని చేస్తున్నామని చెబుతున్నారు.

వారం తర్వాత రమ్మన్నరు

మా తాత గుండె సమస్యతో బాధపడుతున్నడు. చూపించనింకె వికారాబాద్​జిల్లా నుంచి తీసుకొచ్చినం. వెహికల్ ట్రబుల్‌‌ ఇవ్వడం వల్ల కాస్త లేటైంది. వచ్చే సరికి టైమ్‌‌ అయిపోయిందన్నరు. వారం తర్వాత రమ్మని చెప్పిన్రు.

– మల్లికార్జున్, పేషెంట్ మనవడు

ఆన్‌‌లైన్‌‌లో బుక్ చేసుకొని వచ్చిన

నేను రిటైర్డ్ ఎంప్లాయ్‌‌. నా భార్యను చూపించనింకె తీసుకొచ్చిన. ఆన్‌‌లైన్‌‌లో బుక్ చేసుకొని కరీంనగర్ నుంచి వచ్చాం. కరోనా వల్ల హెల్త్ కార్డులను ప్రైవేటు ఆస్పత్రులు పట్టించుకోవట్లేదు. నిమ్స్‌‌లో మాత్రమే కార్డుపై ఫ్రీగా ట్రీట్‌‌మెంట్‌‌ చేస్తున్నరు. అందుకే వచ్చినం.

– ఎ.సత్యనారాయణ, పేషెంట్​ భర్త

For More News..

అక్కడ కరోనా మరణాల్లేవ్

ఈసారి బోనాల పండుగ లేనట్లే

50 ఏళ్లు దాటితే.. గండమే