ఓపెన్‌‌‌‌ టెన్త్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌లో.. ఒకరికి బదులు మరొకరు.. మిర్యాలగూడలో పట్టుకున్న ఆఫీసర్లు

ఓపెన్‌‌‌‌ టెన్త్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌లో.. ఒకరికి బదులు మరొకరు.. మిర్యాలగూడలో పట్టుకున్న ఆఫీసర్లు

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ పట్టణంలో కొనసాగుతున్న ఓపెన్‌‌‌‌ ఇంటర్, టెన్త్‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌ నిర్వహణలో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న ప్రారంభమైన ఓపెన్‌‌‌‌ టెన్త్‌‌‌‌లో ఎగ్జామ్స్‌‌‌‌పై కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో స్థానిక ప్రభుత్వ బాలికల స్కూల్‌‌‌‌లోని సెంటర్‌‌‌‌ను డీఈవో భిక్షపతి, తహసీల్దార్‌‌‌‌ హరిబాబు, ఎంఈవో బాలునాయక్‌‌‌‌ గురువారం తనిఖీ చేశారు. 

ఈ క్రమంలో గువ్వల శ్రీనివాస్‌‌‌‌ అనే క్యాండిడేట్‌‌‌‌కు బదులుగా అప్పాముల శ్రీనివాస్‌‌‌‌ అనే వ్యక్తి పరీక్ష రాస్తుండగా రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఒక్కో సెంటర్‌‌‌‌లో 10 నుంచి 14 మంది ఇదే తరహాలో పరీక్షలు రాస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, అక్రమాలకు సహకరించిన వారిపై చర్యలకు సిఫార్సు చేసినట్లు చెప్పారు. ఓపెన్‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌ నిర్వహణపై విచారణ జరిపిస్తామని డీఈవో చెప్పారు.