ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌జీపీటీలో ఇప్పుడు కొత్తగా ‘కాన్వాస్’ అనే టూల్‌ని తీసుకొచ్చింది. ఇది చాట్‌జీపీటీలో రాయడం, కోడింగ్ చేయడంలో సాయపడుతుంది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. అసలు కాన్వాస్ అంటే ఏంటి? ఎలా వాడాలో తెలుసుకుందాం.
కాన్వాస్ అనేది చాట్‌జీపీటీలో వచ్చిన కొత్త ఇంటర్ఫేస్. ఇది ఏఐతో రాస్తుంది. కోడింగ్ చేస్తుంది. ఇది ఓపెన్ చేయగానే ఒక స్పెషల్ విండో ఓపెన్ అవుతుంది. యూజర్లు దీన్ని ఈజీగా వాడొచ్చు. ఇది రియల్ టైం ఎడిటింగ్, డీటెయిలింగ్ వంటివి మార్పులు చేస్తుంది. దీన్ని ‘యూజ్ ది కాన్వాస్’ అనే ఆప్షన్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. కాన్వాస్‌లో పైథాన్ కోడ్, కస్టమ్ జీపీటీస్, రైటింగ్ అసిస్టెన్స్, కోడింగ్ టూల్స్ వంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు కాన్వాస్ ద్వారా పైథాన్ కోడ్ చేసి, రియల్ టైం అవుట్‌పుట్ పొందొచ్చు.
అలాగే యూజర్లు తమ సొంత జీపీటీలను కాన్వాస్‌కు జోడించి, చక్కగా పనిచేసుకోవచ్చు. దాంతోపాటు ఏఐ ద్వారా ఎడిటింగ్ సూచనలు, ఇన్లైన్ ఫీడ్ బ్యాక్, టోన్ అడ్జస్ట్మెంట్ వంటివి చేయొచ్చు. ఇక చివరిగా కోడ్ రివ్యూ చూడొచ్చు. డీబగ్గింగ్ చేయొచ్చు. ఇతర కోడ్లను మెరుగుపరచొచ్చు. అంతేనా.. కాన్వాస్‌లో స్టోరీ బోర్డ్ ఫీచర్ కూడా ఉంది. అంటే ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలంటే దానికి సంబంధించిన స్టోరీ బోర్డ్ కాన్వాస్‌లో క్రియేట్ చేసుకోవచ్చన్నమాట.