Open AI ఓ కొత్త AI మోడల్ ను లాంచ్ చేసింది. ఇది అద్భుతమైన వీడియోలు సృష్టిస్తోంది. సోరా అని పిలువబడే ఈ కొత్త మోడల్ కేవలం టెక్ట్స్ ప్రాంప్ట్ ల నుంచి ఒక నిమిషం వీడియోను సృష్టించగలదు. Open AI సీఈవో సామ్ ఆల్ట్ మన్ తన X ఖాతాల్లో పోస్ట్ ల ద్వారా ఈ కొత్త ఓపెన్ ఏఐ మోడల్ ను చూపించారు.
సోరా ఏం చేయగలదో మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా ఏదైతే వీడియోలను రూపొందించాలనుకుంటున్నారో వాటికి టెక్ట్స్ ప్రాంప్ట్ లను పంపించండి .. మేం కొన్నింటిని తయారు చేసి పంపిస్తాం.అంటూ ఆల్ట్ మన్ తన పోస్ట్ లో రాశారు. సోరా తయారుచేసిన కొన్ని వీడియోలను ఆల్ట్ మన్ షేర్ చేశారు. సోరా సృష్టించిన వీడియోలు అచ్చు ఒరిజనల్ వీడియోల్లాగే ఉన్నాయి.
Open AI Sora మోడల్ సామర్థ్యం నిస్సందేహంగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. సాధారణ టెక్ట్స్ ప్రాంప్ట్ లనుంచి ఒక నిమిషం వీడియోను రూపొందించగల మోడల్ ఇది.. 2023 ప్రారంభంలో వైరల్ అయిన విల్ స్మిత్ స్పగెట్టి తింటున్న AI రూపొందించిన వీడియోను మీకు గుర్తిండే ఉంటుంది. ఆ వీడియోలో లోపాలను సోరా సరిచేసింది. అంతేకాదు.. స్కార్ లెట్ ఏదో తింటున్న వీడియోను .. సోరా దానిని మరింత వాస్తవికంగా కనింపించేలా అభివృద్ది చేసింది.
అయితే Open AI Sora భద్రతకు సంబంధించి ఆందోలనలు లేకపోలేదు. Open AI సోరాను విడుదల చేయడానికి ముందు కీలకమైన భద్రతా చర్యలు అమలు చేస్తామని కంపెనీ తెలిపింది. ఇందులో రెడ్ టీమర్, తప్పుడు ప్రచారం, ద్వేష పూరిత కంటెంట్, పక్ష పాత ధోరణి వంటి వాటిని గుర్తించేందుకు నిపుణులు ఈ కొత్త మోడల్ ను పరీక్షించాకే బయటకు వస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
https://t.co/qbj02M4ng8 pic.twitter.com/EvngqF2ZIX
— Sam Altman (@sama) February 15, 2024
welcome to bling zoo! this is a single video generated by sora, shot changes and all. https://t.co/81ZhYX4gru pic.twitter.com/rnxWXY71Gr
— Bill Peebles (@billpeeb) February 15, 2024