సెప్టెంబర్ (20) నుంచి కాళేశ్వరంపై ఓపెన్ కోర్టు.

సెప్టెంబర్ (20) నుంచి కాళేశ్వరంపై ఓపెన్ కోర్టు.

 

  • హైదరాబాద్​కు వచ్చిన కమిషన్​ చైర్మన్​ జస్టిస్ ​పీసీ ఘోష్​

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ మరో దఫా ఓపెన్​ కోర్టు విచారణ చేపట్టనుంది. అఫిడవిట్లు సమర్పించిన పలువు రు ఇంజినీర్లు, అధికారులను .శుక్రవారం నుంచి  విచారించ నుంది. కాళేశ్వరం కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పీసీ.ఘోష్ బుధవారం సాయంత్రం హైదరాబాద్​కు వచ్చారు. ఓపెన్​ కోర్టుకు ఎవరిని పిలవాలన్న దానిపై జస్టిస్​ ఘోష్​ గురువారం నిర్ణయించను న్నారు. గత ఓపెన్​ కోర్టులో రెండు గంటల వరకే అధికారులను విచారించగా.. ఈ దఫా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా విచారించనున్నారు. కాగా, గత నెల 20 నుంచి 24వ తేదీ వరకు జస్టిస్​ ఘోష్​ పలువురు అధికారులను విచారించారు.