సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లు మెయింటనెన్స్ లేక మూలనపడుతున్నాయి. దీంతో పరికరాలు పాడై, తుప్పు పట్టి నిరుపయోగంగా మారుతున్నాయి. బల్దియా ఆధ్వర్యంలో 2018 నుంచి దశల వారీగా ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో జిమ్‌కు రూ.6.25లక్షలు ఖర్చు చేశారు. కాగా గణేశ్ నగర్, వెంకంపేట్, బతుకమ్మ ఘాటు, కొత్త చెరువు, శాంతినగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జిమ్ లు పూర్తిగా పాడై నిరుపయోగంగా ఉన్నాయి.
అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్, కొత్త చెరువు ప్రాంతాల్లోని జిమ్‌లను తొలగించారు. ఈ విషయాన్ని బల్దియా కమిషనర్ లావణ్య దృష్టికి తీసుకుపోగా ఎలక్షన్ కోడ్ ముగియగానే రిపేర్లు చేయించి వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. - రాజన్నసిరిసిల్ల, వెలుగు