కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో ఓపెన్‌‌‌‌‌‌‌‌ హౌస్

కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో  ఓపెన్‌‌‌‌‌‌‌‌ హౌస్

కరీంనగర్ క్రైం,వెలుగు: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం  కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని  సీపీ అభిషేక్ మహంతి ప్రారంభించగా.. సిటీలోని స్కూళ్లు, కాలేజీలకు చెందిన  దాదాపు 1000 మంది విద్యార్థులు సందర్శించారు. ఓపెన్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌లో పోలీసుశాఖలోని వివిధ విభాగాల పనితీరును తెలిపేలా స్టాళ్లను ఏర్పాటు చేశారు.  

గన్స్‌‌‌‌‌‌‌‌, పోలీసు జాగిలాల ప్రదర్శన,  సైబర్ క్రైమ్, యాంటీ నార్కోటిక్ సెల్, షీ టీమ్, ట్రాఫిక్ పోలీసుల పనితీరు, స్మోక్ గన్ లు , వజ్ర, కమాండ్ కంట్రోల్ వాహనాలను  పనితీరుపై  విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏడీసీపీ అనోక్ జయ్ కుమార్, ఏసీపీలు విజయ్ కుమార్ , మాధవి , నరేందర్, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐలు రజినీకాంత్ , శ్రీధర్ రెడ్డి , కుమార స్వామి పాల్గొన్నారు.