వామ్మో..ఆదమరిస్తే అంతే..!

ఖమ్మం ఓల్డ్ బస్టాండ్ ఆవరణలో ఉన్న మూత కప్పని మ్యాన్ హోల్ ప్రమాదకరంగా మారింది. నిత్యం వందలాది మంది ప్రయాణికులు తిరిగే దారిలో మ్యాన్​ హోల్​ను అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మ్యాన్ హోల్ పై మూతను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు