- ఎస్ఎస్సీలో 51%,ఇంటర్లో 52% పాస్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఎస్సీలో 51.20% మంది, ఇంటర్లో 52.72% మంది పాసయ్యారని టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి, జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి తెలిపారు. ఎస్ఎస్సీలో 31,691మంది పరీక్ష రాయగా, 16,226 మంది పాసయ్యారు. పాసైన వారిలో అమ్మాయిలు 7,042 మంది, అబ్బాయిలు 9,184 మంది ఉన్నారు. ఇంటర్మీడియెట్‌లో 41,668 మంది ఎగ్జామ్స్‌కు అటెండ్ కాగా.. 21,967 మంది ఉత్తీర్ణత సాధించారు.
పాసైన వారిలో అమ్మాయిలు 9,025 మంది ఉండగా, అబ్బాయిలు 12,942 మంది ఉన్నారు. కాగా.. ఎస్ఎస్సీలో రాజన్న సిరిసిల్లా 89.23 ఉత్తీర్ణత శాతంతో టాప్ లో ఉండగా, జయశంకర్ భూపాలపల్లి 10.44 శాతంతో చివరిలో నిలిచింది. ఇంటర్ లో యాదాద్రి జిల్లా 80.70 శాతంతో టాప్ లో ఉండగా, వికారాబాద్ 35.34 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఫలితాలపై రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఈ నెల18 నుంచి 27 వరకూ అప్లై చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
రీకౌంటింగ్ కు ఇంటర్ లో ఒక్కో సబ్జెక్టుకు రూ.400, ఎస్ఎస్సీలో ఒక్కో సబ్జెక్టుకు రూ.350 ఫీజు ఉంటుందన్నారు. ఇంటర్, టెన్త్ ఒక్కో సబ్జెక్టు రీవెరిఫికేషన్ కోసం రూ.1200 ఫీజు చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్‌కు అప్లై చేసిన వారికి జిరాక్స్ ఆన్సర్ స్ర్కిప్టు పంపిస్తామన్నారు. ఫలితాలను www.telanganaopenschool.org వెబ్ సైట్లో చూడాలని పేర్కొన్నారు.