
- ఇండియాలో ఓపెన్‌ఏఐ మోడల్స్‌ను నిర్వహించే ఆలోచన
న్యూఢిల్లీ: ఏఐ బిజినెస్‌లో కలిసి పనిచేయడానికి ఓపెన్‌ఏఐతో ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరుపుతోంది. చాట్‌జీపీటీని ఇండియాలో ఆపరేట్ చేసే ఆలోచనలో ఉందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. యూజర్ల డేటాను సురక్షితంగా ఉంచుతూనే, ఏఐని ఇండియాలో బలోపేతం చేయాలని రిలయన్స్ టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా ఓపెన్‌ఏఐతో మంతనాలు జరుపుతోంది.
కంపెనీ గుజరాత్ జామ్‌నగర్‌లోని తన 3 గిగావాట్ల డేటా సెంటర్ నుంచి ఈ ఏఐ మోడల్స్‌ను ఆపరేట్ చేయనుంది. జియో వంటి టెలికం కంపెనీలు తమ సర్వీస్‌లలో ఏఐని కలపాలని చూస్తున్నాయి. యాప్ ద్వారా ఓపెన్ఏఐ మోడల్స్‌ను కంపెనీలకు అందుబాటులో ఉంచాలని కూడా రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఓపెన్‌ఏఐ తన సర్వీస్‌లపై సబ్‌స్క్రిప్షన్ ఫీజును తగ్గించాలని ఆలోచిస్తోంది. ఇదే జరిగితే చాట్‌జీపీటీ టూల్స్ తక్కువ రేటుకే ఇండియాలో అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం చాట్‌జీపీటీ బేసిక్ వెర్షన్ ఫ్రీగా అందుబాటులో ఉంది. చాట్‌జీపీటీ 4.5 వంటి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్‌ను వాడుకోవడానికి వీలుండే ప్రీమియం వెర్షన్ కోసం మాత్రం డబ్బులు కట్టాలి. నెలకు రూ.1,720 (20 డాలర్లు) సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి.