ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ మొదలయ్యింది. అతి తక్కువ ఖర్చుతో చైనా డీప్ సీక్ ప్రారంభించడంతో అంతకు ముందే మార్కెట్లో ఉన్న AI కంపెనీల్లో ఆందోళన మొదలైంది. డీప్ సీక్ ఏఐ మార్కెట్ ను శాసిస్తుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్టివిటీ ఇచ్చేలా పనిచేస్తుందనే ఊహాగానాల నడుమ.. చాట్ ChatGPT తో ఏఐ మార్కెట్ లో ఆధిపత్యం సంపాదించిన ఓపెన్ ఏఐ మరో అడుగు ముందుకేసింది. చైనా Deep Seek కు పోటీగా Deep Research (డీప్ రీసెర్చ్) అనే టూల్ ను తీసుకొచ్చింది.
డీప్ రీసెర్చ్ ఎలా పనిచేస్తుంది:
డీప్ రీసెర్చ్ చాట్ జీపీటీకి ఏజెంట్ గా పనిచేస్తుందని ఓపెన్ ఏఐ ప్రకటించింది. చాట్ జీపీటీని ఉపయోగించి చాలా లోతైన, క్లిష్టమైన పరిశోధన చేసేందుకు సహకరిస్తుందని పేర్కొంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫైనాన్స్ (ఆర్థిక), ఇంజినీరింగ్ తదితర రంగాలలో పరిశోధనకు ఉపరకరిస్తుందని ఓపెన్ ఏఐ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రీసెర్చ్ ఎనాలిసిస్ లో వందల కొద్దీ ఆన్ లైన్ సోర్స్ ను పరిశీలించి అద్భుతమైన రిపోర్టును తయారు చేసేందుకు ఉపయోగపడుతుందట ఈ డీప్ రీసెర్చ్.
ALSO READ : డాలర్ కళకళ.. రూపాయి విలవిల.. ట్రంప్ విధానాలపై ప్రధాని మోదీ స్పందనేది..?
చాట్ జీపీటీ మెసెజ్ కంపోజర్ బాక్స్ లో Deep Research అనే ఆప్షన్ ను ఎంచుకొని రీసెర్చ్ ఎనాలిసిస్ ను చేయొచ్చు. చాట్ జీపీటీకి ఇది కొత్త ఏజెంట్ టూల్ గా పనిచేస్తుందని, మనం ఇచ్చే ప్రాంప్ట్ లేదా ఇన్ పుట్ ఆధారంగా ఎనాలిసిస్ ను ఇస్తుందని ఓపెన్ ఏఐ ప్రకటించింది. రీసెర్చ్ ఓరియెంటెడ్ అంశాలలో డీప్ రీసెర్చ్ చాలా బాగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రకటించింది.