కొత్తగా మూడు OpenAI ఏజెంట్లు.. పీహెచ్డీస్థాయి పనితీరు..సబ్ స్క్రిప్షన్ నెలకు ఎంతంటే..?

కొత్తగా మూడు OpenAI ఏజెంట్లు.. పీహెచ్డీస్థాయి పనితీరు..సబ్ స్క్రిప్షన్ నెలకు ఎంతంటే..?
  • OpenAI ఉపయోగిస్తే.. సబ్స్క్రిప్షన్ నెలకు రూ.17లక్షలు

ChatGPT మాతృసంస్థ OpenAI కొత్తగా మూడు AI ఏజెంట్లను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇవి వివిధ డొమైన్లపై స్పెషల్ ఇంటె లెక్చువల్ సమాచారాన్ని అందించేందుకు రూపొందించబడ్డాయి. ఇవి ఇప్పుడు సబ్ స్క్రిప్షన్లలో అందించబడువు. వీటికి ప్రత్యేక సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా కాస్ట్ లీ సబ్ స్క్రిప్షన్ ఉంటుంది. ఈ AI ఏజెంట్లు ఏవిధంగా పనిచేస్తాయి.. వీటి సబ్ స్క్రిప్షన్ ఎంతుంటుంది. ఎప్పటినుంచి ఇవి అందుబాటులోకి వస్తాయో .. వివరాల్లోకి వెళితే.. 

ది ఇన్ఫర్మేషన్ కొత్త రిపోర్టు ప్రకారం..శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన OpenAI సంస్థ మూడు కొత్త AI ఏజెంట్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇవి వారి నాలెడ్జ్ విషయంలో అత్యంత ప్రత్యేకత కలిగి ఉంటాయి. ఈ AI ఏజెంట్లు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ 20,000 డాలర్లు అంటే సుమారు రూ. 17లక్షల 41వేలుఉండవచ్చని పేర్కొంది.
ఈ AI ఏజెంట్లలో ఒకటి బెస్ట్ స్కిల్స్ ఉన్న ఇంకమ్ సంపాదించిపెట్టే ఎంప్లాయీగా ఉంటుందని చెబుతోంది. వ్యూహాత్మక ప్లానింగ్, క్రిటికల్ థింకింగ్, డెషిషన్ మేకింగ్ వంటి సామర్థ్యాలను కలిగి ఉంటుంది.దీని సబ్ స్క్రిప్షన్ దాదాపు 2వేల డాలర్లు అనగా రూ.1లక్షా 74వేలకు పైగా ఉంటుందని చెబుతోంది. 

ALSO READ | టెక్నాలజీ : నాలుగు కొత్త ఫీచర్లతో గూగుల్ సర్​ప్రైజ్

ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న మరొక AI ఏజెంట్ నెలకు 10వేల డాలర్లు  అంటే సుమారు రూ. 8లక్షల 07వేలు ఖర్చుతో సొంతం చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉంటుందని చెబుతోంది. కోడింగ్, డీబగ్గింగ్, బగ్ ఫిక్సింగ్,కోడ్ డిప్లాయ్‌మెంట్‌లో స్పెషలిస్ట్గా ఉంటుందని భావిస్తున్నారు.

ఇక మూడో మూడవ AI ఏజెంట్ పీహెచ్‌డీ స్థాయి పరిశోధకుడిగా ఉంటుందని భావిస్తున్నారు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ 20,000డాలర్లు. అంటే దాదాపు 17లక్షల 41వేలు. ఇది మోస్ట్ అడ్వాన్స్ డ్ స్కిల్స్ ను కలిగి ఉంటుంది. లోతైన డేటా విశ్లేషణ, పరిశోధన, అనుకరణను కలిగి ఉంటుందని అంటున్నారు. OpenAI పెట్టుబడిదారుడు అయిన SoftBank ..ఈ AI ఏజెంట్ల కోసం 3 బిలియన్లు డాలర్లు సుమారు రూ. 26కోట్ల112 లక్షలు ఖర్చు చేస్తుందని రిపోర్టులు చెబుతున్నాయి.