మా కంటెంట్ కాపీ కొడుతున్నారు..Chat GPTపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

మా కంటెంట్ కాపీ కొడుతున్నారు..Chat GPTపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

ఇండియాలో ఓపెన్ AI  చాట్ జీపీటీ లీగల్ ఇష్యూస్ని ఎదుర్కొంటోంది. ఢిల్లీ హైకోర్టు లో OpenAIకి వ్యతిరేకంగా ఇండియన్ బుక్ పబ్లిషర్స్ కాపీరైట్ పిటిషన్ వేశారు. తమ కంటెంట్ ను ChatGPT అనుమతి లేకుండా వాడుకుంటుందని పిటిషన్ లో తెలిపారు. భారతదేశంలో AI వినియోగంతో పబ్లిషర్స్  భవిష్యత్తును గందరగోళంలో పడిందని పిటిషనర్లు తెలిపారు. యాజమాన్య కంటెంట్‌ను యాక్సెస్ చేయకుండా ChatGPT చాట్‌బాట్ ఆపాలని కోరుతూ శుక్రవారం పిటిషన్ వేశారు.

ఇటీవల కాలంలో AI  వాడకం పెరిగిన తర్వాత కాపీరైట్ కంటెంట్ వినియోగంపై పబ్లిషర్లు, రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు. AI  సేవలను అందించేందుకు శిక్షణ ఇవ్వడానికి టెక్నికల్ సంస్థలు తమ కాపీరైట్ కంటెంట్ ను వినియోగిస్తున్నాయని, చాట్ బాట్ కు శిక్షణనిచ్చే కంటెంట్  ను యాక్సెస్ చేయకుండా తొలగించాలని కోరారు. 

బ్లూమ్స్ బరీ  పబ్లిషర్స్,పెంగ్విన్ రాండమ్ హౌజ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, పాన్ మాక్ మిలన్, రూపా పబ్లికేషన్ , ఎస్ చాంద్ అండ్ కో వంటి పబ్లిషర్స్ తో  సహా ఫెడరేషన్ సభ్యులందరి తరపున కేసు దాఖలు చేశారు. 

ఎలాంటి ఒప్పందం లేకుండా కాపీరైట్ కంటెంట్ ఉపయోగించకుండా ఆపాలని పబ్లిషర్లు, వార్త పత్రికుల యాజమాన్యం, రైటర్లు పిటిషన్లో కోర్టును కోరారు. ఒప్పందం చేయకూడదని ఓపెన్ ఏఐ అనుకుంటే.. AI  శిక్షణలో ఉపయోగించిన డేటా సెట్ లను తొలగించాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

2022నవంబర్ లో ప్రారంభమైన జనరేటివ్ AI..ChatGPT పెట్టుబడి, కన్స్యూమర్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఈ సంస్త 6.6 బిలియన్ డాలర్లు సంపాదించింది.. ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ మొదటి స్థానం కోసం పోటీ పడుతోంది.