గుడ్న్యూస్..ChatGPT కి ఫోన్ నంబర్..వాట్సాప్ ద్వారా చాట్స్, కాల్స్

గుడ్న్యూస్..ChatGPT కి ఫోన్ నంబర్..వాట్సాప్ ద్వారా చాట్స్, కాల్స్

OpenAI ChatGPT కోసం అధికారిక ఫోన్ నంబర్ ను పరిచయం చేసింది. ఈ నంబర్ ద్వారా OpenAI ChatGPT చాట్ బాట్ ను యాక్సెస్ చేయొచ్చు. ఈ నంబర్ నుంచి కాల్ చేయొచ్చు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్ బాట్ తో మాట్లాడొచ్చు. వాట్సాప్ ద్వారా టెక్ట్స్ మెసేజ్ చేయొచ్చు. నెలకు 15 నిమిషాల వాయిస్ కాల్ సమయం లిమిట్ ఉంటుంది. అయితే భవిష్యత్ దీనికి పెంచే అవకాశాలున్నాయి OpenAI సంస్థ తెలిపింది. 

OpenAI ChatGPT కోసం కొత్త నంబర్ ను Xలో ప్రకటించింది. కొత్త వ్యానిటీ ఫోన్ నంబర్ 1-800-ChatGPT (+1-800-242-8478) ద్వారా ChatGPTకి ఫోన్ కాల్స్ చేసేందుకు OpenAI అనుమతిస్తుంది. వానిటీ ఫోన్ నంబర్లు కీప్యాడ్ లో అక్షరాలను అనుసరిస్తాయి. A,B, C అక్షరాలు 2ని, D,E, F అక్షరాలు 3ని సూచిస్తాయి. ఈ ఫోన్ నంబర్ ను గుర్తించుకునేందుకు 800 కోడ్ ఉంటుంది.

ఈనంబర్ పూర్తిగా టోల్ ఫ్రీ నంబర్ అంటే కాల్ చేసేవారికి ఎలాంటి ఖర్చులు భరించాల్సిన అవసరంలేదు.. ప్రస్తుతం ఈ నంబర్ యూఎస్, కెనడా దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో మాత్రం వాట్పాప్ ద్వారా కాల్స్ చేయొచ్చు.. టెక్ట్స్ మేసేజ్ లు పంపించడం ద్వారా కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. 

ఈ కొత్త నంబర్ ద్వారా చాట్ జీపీటి నెలకు 15 నిమిషాల కాల్స్ సమయం అందిస్తుంది.. భవిష్యత్తు ఈ సమయాన్ని పెంచే అవకాశం ఉంది. ఈ నంబర్ ను సేవ్ చేసిన తర్వాత కస్టమర్లు WhatsApp యాప్  లేదా వెబ్ సైట్ ద్వారా చేసినట్లుగానే..ChatGPTకి మేసేజ్ లు పంపించొచ్చు. ప్రస్తుతం చాట్ బాట్ WhatsApp ఎక్స్ టెన్షన్ టెక్ట్సును ఇన్ పుట్, అవుట్ ఫుట్ గా మాత్రమే సపోర్ట్ చేసింది. సెర్చింగ్, క్యాన్వాస్, DALL-E ద్వారా ఇమేజ్ జనరేషన్ వంటి ఇతర ఫీచర్లు కూడా WhatsApp  లేద ఫోన్ కాల్స్ లో అందుబాటులో ఉండవు. 

ChatGPT ని ప్రజల్లోకి మరింతగా వేగంగా, విస్తృతంగా తీసుకెళ్లేందుకు OpenAI చాలా ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ ఇప్పటికే పెద్ద భాషా నమూనాలు(LLM) అందించేందుకు Microsoft ,Apple తో టైఅప్ అయింది.ChatGPT ఈ ఏడాది విండోస్ , మాక్ OS కి కూడా అందుబాటులోకి వచ్చింది. అయితేచాట్ బాట్ ను గ్రామీణ జనాభాకు అందించే లక్ష్యంగా  OPenAI ఈ కొత్త నంబర్ ను పరిచయం చేసింది.