చెప్తే గుర్తుంచుకుంటుంది.. వద్దంటే మర్చిపోతుంది అంతా AI మహిమ

చెప్తే గుర్తుంచుకుంటుంది.. వద్దంటే మర్చిపోతుంది అంతా AI మహిమ

టెక్నాలజీ రోజురోజుకు అవధులు దాటిపోతుంది. మనం ఊహించలేనంతగా ఆధునిక ప్రపంచంలో మార్పులు సంభవిస్తున్నాయ్.. ఏఐ రాకతో టెక్నాలజీ స్పీడ్ ఇంకాస్త పెరిగిందనే చెప్పవచ్చు. నిన్నమొన్న వచ్చిన చాచ్ జీపీటీ, చాట్ బాట్ లకు ఏఐ హంగులు అద్దుతుంది. ఓ ఏజ్ వచ్చాక ఎవరికైనా మెమరీ పవర్ తగ్గి మతిమరుపు సహజం. అయితే మనం చేయాల్సిన పనుల్ని ఎవరో ఒకరు గుర్తు చేయాలి. దీని కోసం ఏఐ టెక్నాలజీతో ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అది మన మెమరీని కంట్రోల్ చేస్తోంది. వారం రోజుల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. మీరు మాట్లాడేటప్పుడు, ఏవైనా పనులు చేసేటప్పుడు ఆటోమేటిక్ గా అది గుర్తుంచుకోవాలా, ఏ టైంటో మళ్లీ యూజర్ కు గుర్తి చేయాలి. అనేవి సేవ్ చేసుకున్న మెమరీలు ఎప్పుడు రిపీట్ చేయాలని ఏఐయే గుర్తు ఉంచుకుంటుంది. 

దాని పేరే మెమరీ  ఎప్పుడు ఏం చేయాలి ? ఏం మాట్లాడాలి ? అనేది చాట్ జీపీటికి చెప్తే అది గుర్తు పెట్టుకుంటోందట. చాట్ జీపీటీలో ఉండే మెమరీ ఆప్షన్ ఏం గుర్తు పెట్టుకుంది అని అడిగితే చెపుతుంది. అంతే కాదు ఆ టైంకి మనకు గుర్తు చేస్తుంది కూడా.  చాట్ జీపీటీ, చాట్ బాట్ లో ఈ ఫీచర్ తీసుకురావడానికి ఓపెన్ ఏఐ ఈ టెక్నాలజీ టెస్టులు చేస్తోంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే త్వరలో మనకు మెమరీ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. మెమరీ ఆప్షన్ ఆఫ్ చేసుకోవచ్చు.   
 యూజర్ ఏఐని గైడ్ చేయవచ్చు. పర్టిక్యులర్ టాఫిక్స్ డిలెట్ చేసుకోవచ్చు. టెంప్రవరీ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. దీని వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని, మన మెమరీస్ క్రియేట్ చేసుకోవడం, గుర్తు ఉంచుకోవడం సులభమని కొంతమంది టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.

Also Read: టాటా ఈవీల ధరల తగ్గింపు