
చైనా AI మోడల్ DeepSeek చాలా హానికరం అని Open AI ఆరోపిస్తోంది. ఇటువంటి మోడళ్లను వెంటనే నిషేధించాలని అంటుంది.. అందుకోసం అమెరికా ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టింది. చైనా ఏఐ మోడల్ డీప్ సీక్ ను నిషేధించాలని Open AI అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. కస్టమర్ డేటా భద్రతకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. DeepSeek మోడళ్లు చైనా నియంత్రణలో నడుస్తున్నాయి. అటువంటి మోడళ్లను వెంటనే కట్టడి చేయాలని అమెరికా ప్రభుత్వాన్ని ఓపెన్ ఏఐ కోరింది.
DeepSeek కు చెందిన తార్కిక నమూనా R1 చాలా హానికరమని పేర్కొం ది. చైనా రూల్స్ ప్రకారం.. కస్టమర్ డేటా అభ్యర్థులకు అనుగుణంగా ఉండటం అవసరం అందుకే అది ప్రమాదకరమైనది అని పేర్కొంది.
Also Reda:-ఇండియాలో కంట్రోల్ సెంటర్ పెట్టండి.. స్టార్‌లింక్‌ను కోరిన కేంద్రం..
గతంలో కూడా ఓపెన్ ఏఐ.. DeepSeek పై ఆరోపణలు చేసింది. DeepSeek తన మోడల్స్ నుంచి కాపీ కొడుతుందని ఇది నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. తాజా మరోసారి చైనీస్ AI ల్యాబ్‌పై OpenAI తన ఆందోళనను మరింత ఉదృతం చేసింది. అయితే డీప్ సీక్ ను చైనా ప్రభుత్వం నియంత్రణలో నడుస్తుందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు.
మరోవైపు AI కంపెనీలు శిక్షణ కోసం కాపీరైట్ కంటెంట్ ను వినియోగించేందుకు అనుమతివ్వాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది Open AI. వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో AI అభివృద్దిని పెంచడం చైనాతో పోటీ పడేందుకు ఇది దోహదపడుతుందని Open AI కోరింది.