ఆండ్రాయిడ్ వెర్షన్ ..ఇండియాలో చాట్ జీపీటీ.. ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలంటే..

ఆండ్రాయిడ్ వెర్షన్ ..ఇండియాలో చాట్ జీపీటీ.. ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలంటే..

ఈ ఏడాది ప్రారంభంలో Apple iOS ఫోన్లలో విజయవంతంగా చాట్ జీపీటీని అందుబాటులోకి తెచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ OpenAI.. తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ChatGPT అందుబాటులోకి తెచ్చింది. Google Play స్టోర్‌లో నుంచి ChatGPT యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉంది.. ఒక్క క్లిక్ తో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. 

అయితే ఆండ్రాయిడ్‌లో ChatGPT లభ్యత ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలకే పరిమితం చేయబడింది. తాజాగా ఇండియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, అమెరికాలో OpenAI  చాట్ జీపీటీ ని అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మరొకొన్ని దేశాల్లో కూడా ChatGPT యాప్ లాంచ్ చేస్తామని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిపింది. 

Android స్మార్ట్‌ఫోన్‌లో ChatGPTని డౌన్‌లోడ్ చేయడానికి, వినియోగదారులు Google Play Store అప్లికేషన్‌లోకి వెళ్లి OpenAI ద్వారా ChatGPT యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 
OS వెర్షన్ మాదిరిగానే ఆండ్రాయిడ్‌లోని ChatGPT సలహాలు, సమాధానాలు, ఇతర సాయం కోసం ఉత్పాదక AI వినియోగదారులకు సేవలందిస్తుంది. ఈ యాప్ లో వాయిస్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. అయితే ప్లగిన్‌ వంటి కొన్ని ఫీచర్లు Android వెర్షన్‌లో అందుబాటులో లేవు.

ALSO READ :వన్డే వరల్డ్ కప్ 2023.. భారత్ పాక్ మ్యాచ్ జరిగేది అనుమానమే..కారణమిదే

AI చాట్‌బాట్  అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గతేడాది నవంబర్‌లో సామ్ ఆల్ట్‌మాన్ నేతృత్వంలోని కంపెనీ ప్రారంభించారు. తక్కువ సమయంలో నే ChatGPT గణనీయమైన వృద్ది సాధించింది. అందరి దృష్టిని ఆకర్షించింది, ఇది టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. కంటెంట్ ఉత్పత్తి, కోడింగ్, పుస్తకాల సారాంశాలను అందించడం ద్వారా పరిశోధకులు, విద్యావేత్తలు వంటివారికి AI చాట్‌బాట్ అత్యంత ఉపయోగకరంగా సేవలందిస్తోంది.

 

ChatGPT for Android is now available for download in the US, India, Bangladesh, and Brazil! We plan to expand the rollout to additional countries over the next week. https://t.co/NfBDYZR5GI

— OpenAI (@OpenAI) July 25, 2023